పల్లవి:
అమ్మా చూడాలి...నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా...
అమ్మా చూడాలి... నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా...
చరణం 1:
ఇల్లు చేరే దారే లేదమ్మా...
నిన్ను చూసే ఆశే లేదమ్మా...
ఇల్లు చేరే దారే లేదమ్మా...
నిన్ను చూసే ఆశే లేదమ్మా...
నడవాలంటే ఓపిక లేదు...ఆకలి వేస్తోంది
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా...
చరణం 2:
పలికేందుకు మనిషే లేడు...
నిలిచేందుకు నీడే లేదు ...
పలికేందుకు మనిషే లేడు ...
నిలిచేందుకు నీడే లేదు ...
బాధగా ఉంది భయమేస్తోంది.. ప్రాణం లాగేస్తోంది
అమ్మా... అమ్మా......
అమ్మా చూడాలి... నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా..