Title (Indic)నీ చుర చుర చుర చూపులే పంజా WorkPanjaa Year2011 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Yuvan Shankar Raja Writer Ramajogayya Sastry LyricsTeluguపల్లవి: నీ చుర చుర చుర చూపులే పంజా సల సల సల ఊపిరే పంజా నరనరమున నెత్తురే పంజా అణువణువునా సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా చరణం 1: ఈ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి ఆకాశం నీ పంజా... అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా ఆవేశం నీ పంజా... అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా చరణం 2: ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ఎత్తు పల్లం లేనే లేని రహదారంటూ ఉందా ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలిగా నీ అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగా బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా ఆకాశం నీ పంజా... అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజా... అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా Englishpallavi: nī sura sura sura sūbule paṁjā sala sala sala ūbire paṁjā naranaramuna nĕtture paṁjā aṇuvaṇuvunā sattuve paṁjā adubĕrugani vegame paṁjā adarani pĕnu dhairyame paṁjā pĕdavaṁchuna mauname paṁjā padunagu ālosane paṁjā saraṇaṁ 1: ī sīgaḍilo sīgaḍigā mūsina musugā nippula baṁti tappadane yuddhamugā veguva sūḍadā rebaḍi kāṁti āgāśhaṁ nī paṁjā... adi gĕlavāli asalainā guṁḍĕ dammugā āveśhaṁ nī paṁjā... aḍugĕyyāli sĕḍunaṁtaṁ sese saidanyaṁgā saraṇaṁ 2: āḍuboḍu lene leni sāgarame uṁṭuṁdā ĕttu pallaṁ lene leni rahadāraṁṭū uṁdā āgurālani kŏmmarĕmmalu sigurayye vīluṁdā edemainā tudi varagu ĕdurīda sāgāligā nī aḍugaḍugu alajaḍigā nī jīvidame nī śhatruvu kāgā bĕdiriṁche ābadane ĕdiriṁche guṇamegā paṁjā āgāśhaṁ nī paṁjā... adi gĕlavāli asalaina guṁḍĕ dammugā āveśhaṁ nī paṁjā... aḍugĕyyāli sĕḍunaṁtaṁ sese saidanyaṁgā