పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా
పల్లవి:
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో ||2||
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా
చరణం 1:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని ||2||
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ||2||
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది||2||
చరణం 2:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన ||2||
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ||2||
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది||2||
pallavi:
pallaviṁchavā nā gŏṁtulo
pallavi kāvā nā pāḍalo ||2||
praṇaya sudhā rādhā
nā bradugu nīdi kādā
saraṇaṁ 1:
nenunnadi nīlone ā nenu nīvele
nādannadi emunnadi nālo
nevenāḍŏ malisāvu ī rādini
nenīnāḍu palagāli nī gīdini ||2||
ide nāgu tabamanī ide nāgu varamani ||2||
sĕppālani uṁdi guṁḍĕ vippālani uṁdi||2||
saraṇaṁ 2:
nī premagu kalaśhānni nī pūjagu nilayānni
nī vīṇagu nādānni kānā
ne innāḽḽu sesiṁdi ārādhana
nīgu īnāḍu tĕlibedi nā vedana ||2||
ide ninnu vinamani ide nijaṁ anamani ||2||
sĕppālani uṁdi guṁḍĕ vippālani uṁdi||2||