You are here

Pallagilo pelli kooduru

Title (Indic)
పల్లకిలో పెళ్లి కూతురు
Work
Year
Language
Credits
Role Artist
Music M.M. Keeravani
Performer K.S. Chitra
Balasubramaniam S.P.
Writer Samdrabos

Lyrics

Telugu

పల్లవి:

చెంపకు చుక్కను పెట్టి.. పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి.. కస్తూరి నుదుట దిద్ది.. ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయీలుగా మలచిన ఈ పల్లకిలో..

పల్లకిలో.. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది.. మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే.. రాజు గారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగ వచ్చే..
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది.. మహారాణిలా వుంది

చరణం 1:

మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా..
బంగరు బొమ్మా.. బంగరు బొమ్మా..
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా..
వెన్నెల బొమ్మా.. వెన్నెల బొమ్మా..
పరిమళాల గంధపు బొమ్మా..ఆ.. సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట ఏటవమ్మా మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో.. మాటలరాని బొమ్మలమయ్యాము
మాటలరాని బొమ్మలమయ్యాము..

పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది.. మహారాణిలా వుంది

చరణం 2:

నా పెళ్ళిలో అతిథులు మీరే కదా..
అతిథులంటే దేవుళ్ళనే అర్థం కదా..ఆ..
ఈ పందిరి మీ రాకతో..ఓ.. మందిరమే అయ్యింది..
నాపై మీ చల్లన చూపే వరముల వరదైయింది
ఈ అతిది దేవుడు ఆ దేవున్నే కోరేది సౌక్యంగా నువ్వుండాలని..
నీ బ్రతుకంతా బాగుండాలని..

పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది.. మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే.. రాజు గారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగ వచ్చే..

English

pallavi:

sĕṁpagu sukkanu pĕṭṭi.. pādālagi pārāṇi pūsi
sedigi gājulu vesi.. kastūri nuduḍa diddi.. mutyānigi mustābe sesi
mā hṛdayālanu boyīlugā malasina ī pallagilo..

pallagilo.. pallagilo pĕḽli kūduru rāṇilā vuṁdi.. mahārāṇilā vuṁdi
rāṇi gārigi siggulu vachche.. rāju gārigi sirunavvŏchche
ī iddari pĕḽḽigi ānaṁdaṁ adithiga vachche..
pallagilo pĕḽli kūduru rāṇilā vuṁdi.. mahārāṇilā vuṁdi

saraṇaṁ 1:

mā gūḍilo ĕdigina baṁgaru bŏmmā..
baṁgaru bŏmmā.. baṁgaru bŏmmā..
mā nīḍalo vĕligina vĕnnĕla bŏmmā..
vĕnnĕla bŏmmā.. vĕnnĕla bŏmmā..
parimaḽāla gaṁdhabu bŏmmā..ā.. sunnidāla gāju bŏmmā
puṭṭiniṁṭa eḍavammā mĕṭṭiniṁṭa sīdavammā
ī bŏmmanu attiṁṭigi paṁpiṁche ānaṁdaṁlo.. māḍalarāni bŏmmalamayyāmu
māḍalarāni bŏmmalamayyāmu..

pallagilo pĕḽli kūduru rāṇilā vuṁdi.. mahārāṇilā vuṁdi

saraṇaṁ 2:

nā pĕḽḽilo adithulu mīre kadā..
adithulaṁṭe devuḽḽane ardhaṁ kadā..ā..
ī paṁdiri mī rāgado..o.. maṁdirame ayyiṁdi..
nābai mī sallana sūbe varamula varadaiyiṁdi
ī adidi devuḍu ā devunne koredi saukyaṁgā nuvvuṁḍālani..
nī bradugaṁtā bāguṁḍālani..

pallagilo pĕḽli kūduru rāṇilā vuṁdi.. mahārāṇilā vuṁdi
rāṇi gārigi siggulu vachche.. rāju gārigi sirunavvŏchche
ī iddari pĕḽḽigi ānaṁdaṁ adithiga vachche..

Lyrics search