Pagale vennelaa jagame ooyala

పగలే వెన్నెలా జగమే ఊయల
Year
Language

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే
ఏ..ఏ..ఏ....
పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 1:

నింగిలోన చందమామ తోంగి చూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే.....
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై
యెదలొ తేనేజల్లు కురిసిపోదా

చరణం 2:

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు శిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా

చరణం 3:

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి పికము పాడే....
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడే
పూలరుతువు సైగ సి పికము పాడే
మనసే వీణగా ఝుణా ఝున మ్రోయగా
మనసే వీణగా ఝుణా ఝున మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా..

pallavi:

ā ā ā ā ā ā ā.......
pagale vĕnnĕlā jagame ūyala
kadalĕ vūhalage kannuluṁṭe
e..e..e....
pagale vĕnnĕlā jagame ūyala

saraṇaṁ 1:

niṁgilona saṁdamāma toṁgi sūse
nīḍilona kaluvabhāma poṁgi pūse.....
yī anurāgame jīvanarāgamai
yī anurāgame jīvanarāgamai
yĕdalŏ tenejallu kurisibodā

saraṇaṁ 2:

kaḍali piluva kannevāgu parugudīse
muraḽibāḍa vinnanāgu śhirasunūbe.....
yī anubaṁdhame madhurānaṁdamai
yī anubaṁdhame madhurānaṁdamai
ilabai naṁdanālu nilibibodā

saraṇaṁ 3:

nīli mabbu nīḍalesi nĕmali āḍe
pūlaruduvu saiga sūsi pigamu pāḍe....
nīli mabbu nīḍalĕsi nĕmali āḍe
pūlaruduvu saiga si pigamu pāḍe
manase vīṇagā jhuṇā jhuna mroyagā
manase vīṇagā jhuṇā jhuna mroyagā
braduge punnamigā virisibodā..