Paadanaa tenugu paada paravashanai

పాడనా తెనుగు పాట పరవశనై
Year
Language

పల్లవి:

పాడనా తెనుగు పాట (2)
పరవశనై..నే పరవశనై మీ ఎదుట మీ పాట

చరణం 1:

కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో (2)
మావులు పూవులు మోపులపైన మసలేగాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట, మధురామృతాల తేట, ఒకపాట

చరణం 2:

త్యాగయ, క్షేత్రయ, రామదాసులు (2), తనివితీర వినిపించినది
నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట, చిక్కని తేనెల ఊట, ఒక పాట

చరణం 3:

ఒళ్ళంత ఒయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ (2)
మెళ్ళో తాళి, కాళ్ళకు పారాణి, మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే
తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు నాట ప్రతిచోట, ఒక పాట

pallavi:

pāḍanā tĕnugu pāḍa (2)
paravaśhanai..ne paravaśhanai mī ĕduḍa mī pāḍa

saraṇaṁ 1:

kovĕla gaṁṭala gaṇagaṇalo godāvari taragala galagalalo (2)
māvulu pūvulu mobulabaina masalegālula gusagusalo
maṁchi mutyāla peḍa, madhurāmṛtāla teḍa, ŏgabāḍa

saraṇaṁ 2:

tyāgaya, kṣhetraya, rāmadāsulu (2), tanividīra vinibiṁchinadi
nāḍunāḍulā kadiliṁchedi vāḍavāḍalā karigiṁchedi
sakkĕra māḍala mūḍa, sikkani tenĕla ūḍa, ŏga pāḍa

saraṇaṁ 3:

ŏḽḽaṁta ŏyyāri koga, kaḽḽagu kāḍuga rekha (2)
mĕḽḽo tāḽi, kāḽḽagu pārāṇi, mĕrise kuṁkuma bŏṭṭu
ghallu ghalluna kaḍiyālaṁdĕlu allanallanā naḍayāḍe
tĕlugu talli pĕṭṭani koḍa, tĕlugu nāḍa pradisoḍa, ŏga pāḍa