Osaari premimchaaga osaari manasichchaaga

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
Work
Year
Language

పల్లవి:

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా

చరణం 1:

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమె అధికారం లేదమ్మా

చరణం 2:

స్వార్ధంలేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ముత్యంలాగా మెరిసీ
సత్యాలెన్నో తెలిపి ముందుకు నిన్నె నడిపిందీ ప్రేమా

pallavi:

osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā
osāri kalagannāga ūhallo kalisunnāga viḍibŏye vīle ledammā
nī kaḽḽallona kannīḍi jallullona ārāḍāle ĕgasi anuvu anuvu taḍisi
iṁkā iṁkā bigisiṁdi premā
osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā

saraṇaṁ 1:

anugoguṁḍā nī ĕda niṁḍā pŏṁgiṁdi ī premā
anugoguṁḍā nī bradugaṁtā niṁḍiṁdi ī premā
anugoni adidhini pŏmmaṁṭu tarimĕ adhigāraṁ ledammā

saraṇaṁ 2:

svārdhaṁleni tyāgālane sesede ī premā
tyāgaṁlonā ānaṁdānne sūsede ī premā
ānaṁdaṁ badulu bādhe kaligiṁche ā tyāgaṁ avasaramā

osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā
osāri kalagannāga ūhallo kalisunnāga viḍibŏye vīle ledammā
nī kaḽḽallonā kannīḍi jallullonā mutyaṁlāgā mĕrisī
satyālĕnno tĕlibi muṁdugu ninnĕ naḍibiṁdī premā