Om... namo naaraayanaaya

ఓం... నమో నారాయణాయ
Year
Language

పల్లవి:

ఓం... నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం
నేడు హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు...
వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు...

చరణం 1:

నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే

వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మినాథుడు శ్రీనివాసుడే...శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే...రాజులకు రాజు ఈ రంగరాజనే

చరణం 2:

నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే

దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట...దైవం కోసం పోరే సమయం లేదంట
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు ...దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

pallavi:

oṁ... namo nārāyaṇāya
rāyini mātraṁ kaṁṭe devuḍu kanarāḍu
devuni mātraṁ kaṁṭe dehaṁ kanarādu
rāyini mātraṁ kaṁṭe devuḍu kanarāḍu
devuni mātraṁ kaṁṭe dehaṁ kanarādu

harini talasu nā hṛdayaṁ
neḍu haruni talasuḍa jaragadule
aṣhṭa akṣharaṁ tĕlisina noru
paṁcha akṣharaṁ palagadule
vaṁkara kannula mīru śhaṁkara kiṁkarulu...
vaiṣhṇavuneṁ sestāru ā yamagiṁkarulu...

saraṇaṁ 1:

niluvu nāmaṁ dālsu talanu mīgu vaṁchanule
niluvunā nanu sīlsudunnā māḍa mārsanule
niluvu nāmaṁ dālsu talanu mīgu vaṁchanule
niluvunā nuvu sīlsudunnā māḍa mārsanule

vīra śhaivula bĕdiriṁpulagu parama vaiṣhṇavaṁ āgadule
prabhuvu ānadigi jaḍisenāḍu paḍamaḍa sūryuḍu pŏḍavaḍule
rājyalakṣhmināthuḍu śhrīnivāsuḍe...śhrīnivāsuḍi vārasuḍī viṣhṇudāsuḍe
deśhānnele vāraṁtā rājya dāsule...rājulagu rāju ī raṁgarājane

saraṇaṁ 2:

nīḍilona muṁchinaṁta nīdi sāvadule
guṁḍĕlona vĕlugunu niṁpe jyodi āradule
nīḍilona muṁchinaṁta nīdi sāvadule
guṁḍĕlona vĕlugunu niṁpe jyodi āradule

divvĕlanārbe suḍigāli vĕnnĕla vĕlugunu ārbenā
nelanu muṁche jaḍivāna āgāśhānne taḍibenā
śhaivaṁ ŏkkaḍi mātraṁ daivaṁ kādaṁṭa...daivaṁ kosaṁ pore samayaṁ ledaṁṭa
rāyini mātraṁ kaṁṭe devuḍu kanarāḍu ...devuni mātraṁ kaṁṭe dehaṁ kanarādu