Okkasaari.. seppalevaa.. nuvvu nachchaavana

ఒక్కసారి.. చెప్పలేవా.. నువ్వు నచ్చావన
Year
Language

పల్లవి:

ఒక్కసారి.. చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
ఓ... చెంత చేరి.. పంచుకోవా.. ఆశని శ్వాసని..
మన గుండె గుప్పెడంతా.. తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి..
ఓ.. నిదురపోయె.. మదిని గిల్లి.. ఎందుకా అల్లరి..

చరణం 1:

చందమామ మనకందదని..
ముందుగానె అది తెలుసుకుని..
చేయి చాచి పిలవొద్దు అని..
చంటి పాపలకు చెపుతామా..

లేని పోని కలలెందుకని
మేలుకొంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని
కంటిపాపలకు చెపుతామా

కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభుతి మననడిగి చేరుతుందా..

ఒక్కసారి.. చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
ఓ... చెంత చేరి.. పంచుకోవా.. ఆశని శ్వాసని..

చరణం 2:

అందమైన హరివిల్లులతో..
వంతెనేసి చిరుజల్లులతో..
చుక్కలన్ని దిగి వస్తుంటే..
కరిగిపోని దూరం ఉందా

అంతులేని తన అల్లరితో
అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరిపడుతూ ఉంటే
ఆకాశం తెగిపడుతుందా

మనసుంటె మార్గం ఉంది కదా
అనుకొంటె అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టె అనుకొంటె తీరిపోదా..

ఒక్కసారి.. చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
ఒహ్... చెంత చేరి.. పంచుకోవా.. ఆశని శ్వాసని..
మన గుండె గుప్పెడంతా.. తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

pallavi:

ŏkkasāri.. sĕppalevā.. nuvvu nachchāvani..
o... sĕṁta seri.. paṁchugovā.. āśhani śhvāsani..
mana guṁḍĕ guppĕḍaṁtā.. tana ūha uppĕnaṁta
ŏdiguṁḍamanaga ŏdileyamaṁṭu badimāludunna veḽa

vĕnnĕledo.. veguvedo.. nīgu tĕlusā mari..
o.. niduraboyĕ.. madini gilli.. ĕṁdugā allari..

saraṇaṁ 1:

saṁdamāma managaṁdadani..
muṁdugānĕ adi tĕlusuguni..
seyi sāsi pilavŏddu ani..
saṁṭi pābalagu sĕbudāmā..

leni poni kalalĕṁdugani
melugŏṁṭĕ avi rāvu ani
janmalonĕ nidarogu ani
kaṁṭibābalagu sĕbudāmā

kalalannavi kalalani nammanani
avi kalavani pilavagu kalavamani
madi mīḍudunna madhurānubhudi mananaḍigi seruduṁdā..

ŏkkasāri.. sĕppalevā.. nuvvu nachchāvani..
o... sĕṁta seri.. paṁchugovā.. āśhani śhvāsani..

saraṇaṁ 2:

aṁdamaina harivillulado..
vaṁtĕnesi sirujallulado..
sukkalanni digi vastuṁṭe..
karigiboni dūraṁ uṁdā

aṁtuleni tana allarido
alubu leni tana alajaḍido
kĕraḍamĕgiribaḍudū uṁṭe
āgāśhaṁ tĕgibaḍuduṁdā

manasuṁṭĕ mārgaṁ uṁdi kadā
anugŏṁṭĕ aṁdaniduṁṭuṁdā
anugunnavanni managaṁdinaṭṭĕ anugŏṁṭĕ tīribodā..

ŏkkasāri.. sĕppalevā.. nuvvu nachchāvani..
ŏh... sĕṁta seri.. paṁchugovā.. āśhani śhvāsani..
mana guṁḍĕ guppĕḍaṁtā.. tana ūha uppĕnaṁtā
ŏdiguṁḍamanaga ŏdileyamaṁṭu badimāludunna veḽa