Okkade aashaa..amdugo shvaasaa

ఒక్కటే ఆశా..అందుకో శ్వాసా
Year
Language

పల్లవి:

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

చరణం 1:

మెత్తగా ఒళ్ళో.. పెట్టుకో కాళ్ళూ ఉందిగా అంక పీఠం .. ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో .. భక్తిగా అద్దుకో ..పుచ్చుకో పాద తీర్ధం..పాద పూజలే ఆది పాఠం
చాకిరీ చెయ్యనా బానిసై .. నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా .. నీ జీవితం సార్ధకం పొమ్మికా
మొక్కులే తీరీ .. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం !

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా

చరణం 2:

నచ్చెనే నారీ .. వచ్చెనే కోరీ ..తెచ్చెనే ప్రేమ సౌఖ్యం..సాటి లేనిదీ ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరీ .. ముచ్చటే తీరీ ..ఇచ్చెనే ప్రేమ రాజ్యం .. అంతులేనిదే సంతోషం
స్వప్నమే సత్యమై వచ్చెనేమో .. వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో .. అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరీ .. ముద్దులే కోరీ .. అందెనా ఇంద్రభోగం !

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా

pallavi:

ŏkkaḍe āśhā .. aṁdugo śhvāsā
achchagā aṁkidaṁ seśhā .. puchchugo prāṇeśhā
achchagā aṁkidaṁ seśhā .. puchchugo prāṇeśhā

sukkane sūśhā .. lĕkkale veśhā
niṁgibai aṁgale veśhā .. kiṁdige diṁcheśhā
niṁgibai aṁgale veśhā .. kiṁdige diṁcheśhā

ŏkkaḍe āśhā .. aṁdugo śhvāsā !

saraṇaṁ 1:

mĕttagā ŏḽḽo.. pĕṭṭugo kāḽḽū uṁdigā aṁka pīṭhaṁ .. āḍabuṭṭuge aṁdugosaṁ
gaṭṭigā paṭṭugo .. bhaktigā addugo ..puchchugo pāda tīrdhaṁ..pāda pūjale ādi pāṭhaṁ
sāgirī sĕyyanā bānisai .. nī sevale sĕyyanā pāduṣhā
dīvĕne tīsugo bāligā .. nī jīvidaṁ sārdhagaṁ pŏmmigā
mŏkkule tīrī .. akkune serī .. dakkĕne saubhāgyaṁ !

sukkane sūśhā .. lĕkkale veśhā
niṁgibai aṁgale veśhā .. kiṁdige diṁcheśhā
achchagā aṁkidaṁ seśhā .. puchchugo prāṇeśhā
ŏkkaḍe āśhā .. aṁdugo śhvāsā

saraṇaṁ 2:

nachchĕne nārī .. vachchĕne korī ..tĕchchĕne prema saukhyaṁ..sāḍi lenidī iṁṭi sakhyaṁ
mĕchchĕne serī .. muchchaḍe tīrī ..ichchĕne prema rājyaṁ .. aṁtulenide saṁtoṣhaṁ
svapname satyamai vachchĕnemo .. vĕchchagā sarvamū paṁchagā
svargame sŏṁtamai dakkĕnemo .. achchaḍā muchchaḍā tīrsagā
makkuve mīrī .. muddule korī .. aṁdĕnā iṁdrabhogaṁ !

ŏkkaḍe āśhā .. aṁdugo śhvāsā
achchagā aṁkidaṁ seśhā .. puchchugo prāṇeśhā
niṁgibai aṁgale veśhā .. kiṁdige diṁcheśhā
ŏkkaḍe āśhā .. aṁdugo śhvāsā