పల్లవి:
ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం... విధి లీల
వెంట ఏ బంధము...రక్త సంబంధము
తోడుగా రాదుగా... తుది వేళ
మరణమనేది... ఖాయమని
మిగిలిన కీర్తి... ఖాయమని
నీ బరువూ... నీ పరువూ... మోసేదీ....
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
చరణం 1:
నలుగురు మెచ్చినా.. నలుగురు తిట్టినా
విలువలే శిలువగా... మోశావూ
అందరు సుఖపడే... సంఘమే కోరుతూ
మందిలో మార్గమే.. వేశావూ...
నలుగురు నేడు.. పదుగురిగా
పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ....
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
చరణం 2:
వెళ్ళిరా నేస్తమా... పోయిరా ప్రియతమా...
నీవు మా గుండెలో నిలిచావూ...
ఆత్మయే నిత్యము... జీవితం సత్యము
చేతలే నిలుచురా... చిరకాలం...
బ్రతికిన నాడు బాసటగా
పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ....
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ...
pallavi:
ŏkkaḍai rāvaḍaṁ... ŏkkaḍai povaḍaṁ
naḍuma ī nāḍagaṁ... vidhi līla
vĕṁṭa e baṁdhamu...rakta saṁbaṁdhamu
toḍugā rādugā... tudi veḽa
maraṇamanedi... khāyamani
migilina kīrdi... khāyamani
nī baruvū... nī paruvū... mosedī....
ā nalugurū... ā nalugurū...
ā nalugurū... ā nalugurū...
saraṇaṁ 1:
naluguru mĕchchinā.. naluguru tiṭṭinā
viluvale śhiluvagā... mośhāvū
aṁdaru sukhabaḍe... saṁghame korudū
maṁdilo mārgame.. veśhāvū...
naluguru neḍu.. padugurigā
paduguru velu vaṁdalugā
nī vĕnage anusarulai naḍisārū....
ā nalugurū... ā nalugurū...
ā nalugurū... ā nalugurū...
saraṇaṁ 2:
vĕḽḽirā nestamā... poyirā priyadamā...
nīvu mā guṁḍĕlo nilisāvū...
ātmaye nityamu... jīvidaṁ satyamu
sedale nilusurā... siragālaṁ...
bradigina nāḍu bāsaḍagā
poyina nāḍu ūraḍagā
abhimānaṁ anurāgaṁ sāḍedī....
ā nalugurū... ā nalugurū...
ā nalugurū... ā nalugurū...