పల్లవి:
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
చరణం 1:
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా, ఆ . . .
ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .
చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే (ఒకటే)
ఓ . . .
చరణం 2:
రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము (ఒకటే)
pallavi:
guṭṭugā ledarĕmmala kulugu ninnu
rŏṭṭĕmukkala madhyana pĕṭṭiranusū
ela iṭṭula siṁtiṁtuve ṭŏmeḍo
adivaliddari madhya nā gadini ganumā, ā . . .
ŏgaḍe hṛdayaṁ kosamu iruvuri poḍī doṣhamu
ŏgaḍe hṛdayaṁ kosamū
saraṇaṁ 1:
ŏgaru satyabhāma ŏgaremŏ rukmiṇi
madhya naligināḍu mādhavuṁḍu
iddaradivalunna iragāḍamenayā
viśhvadābhirāma vinura vemā, ā . . .
ā . . o . .
jadagā sĕlimī sesirī, adigā karuṇe sūbirī
ā . . .
sĕlime valabai māride śhivaśhiva manabani ākhare (ŏgaḍe)
o . . .
saraṇaṁ 2:
rāmunidŏgaḍe bāṇamu jānagi ādani prāṇamu
ā . . .
premagu adiye nīmamu preyasi ŏgare nyāyamu (ŏgaḍe)