O vennela... telisedelaa ne

ఓ వెన్నెల... తెలిసేదెలా నే
Year
Language

పల్లవి:

ఓ వెన్నెల... తెలిపేదెలా నే
ఓ నేస్తమా... నిలిచేదెలా నే
కళ్ళు కళ్ళు కలిసాయంటా
వలపే పూవై పూసిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే
నీ ఎదలో బాధా తీరేదెట్లా
ఓ వెన్నెల కలిపేదెలా...

చరణం 1:

జడివాన నింగినీ తడి చేయునా?
గంధాలు పూవుని విడిపోవునా?
నన్నడిగి ప్రేమా ఎదచేరెనా
వలదన్న ఎదనూ విడిపోవునా
మరిచాను అన్న మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెల కలిపేదెలా నే...

చరణం 2:

వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బ్రతకూ బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే
కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమా చనిపోదులే
ఏనాటికైనా నిను చేరులే

pallavi:

o vĕnnĕla... tĕlibedĕlā ne
o nestamā... nilisedĕlā ne
kaḽḽu kaḽḽu kalisāyaṁṭā
valabe pūvai pūsiṁdaṁṭā
namminavāre puvvuni koste
nī ĕdalo bādhā tīredĕṭlā
o vĕnnĕla kalibedĕlā...

saraṇaṁ 1:

jaḍivāna niṁginī taḍi seyunā?
gaṁdhālu pūvuni viḍibovunā?
nannaḍigi premā ĕdaserĕnā
valadanna ĕdanū viḍibovunā
marisānu anna marisedĕlā
marisāga nenu bradigedĕlā
o vĕnnĕla kalibedĕlā ne...

saraṇaṁ 2:

valabiṁchu hṛdayaṁ ŏgaḍe kadā
ĕḍamaide bradagū baruve kadā
nilibānu prāṇaṁ nīgosame
kalanaina kūḍā nī dhyāname
madiloni premā sanibodule
enāḍigainā ninu serule