O jaabilee.. vennela aagaasham

ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం
Year
Language

పల్లవి:

ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం

చరణం 1:

కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే

భ్రమర నాదాలు ఉ ఉ ఉ
భ్రమర నాదాలు ప్రేమ గీతాలై పరిమళించేనోయి
పున్నమై రావోయి నా పున్నెమే నీవోయి

ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం

చరణం 2:

నవ్వులన్ని పువ్వులైన నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి ఎదను మీటే ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు ఉ ఉ ఉ
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి
అనురాగమే నీవోయి అనురాగమే నీవోయి

ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

pallavi:

o jābilī... vĕnnĕla āgāśhaṁ unnade nīgosaṁ
ĕduru sūsiṁdi nidura kāsiṁdi kaluva nīgosame
vĕluguvai rāvoyi vĕludure tevoyi
o jābilī vĕnnĕla āgāśhaṁ unnade nīgosaṁ
juṁjuṁjuṁ juṁjuṁjuṁ juṁjuṁjuṁ juṁjuṁjuṁ

saraṇaṁ 1:

kadaliboye kālamaṁtā ninnu nannu nilisi sūse
kalalu kanna kaugiliṁta valabu tībi valalu vese

bhramara nādālu u u u
bhramara nādālu prema gīdālai parimaḽiṁchenoyi
punnamai rāvoyi nā punnĕme nīvoyi

o jābilī vĕnnĕla āgāśhaṁ unnade nīgosaṁ
juṁjuṁjuṁ juṁjuṁjuṁ juṁjuṁjuṁ juṁjuṁjuṁ

saraṇaṁ 2:

navvulanni puvvulaina nā vasaṁtaṁ nīgu sŏṁtaṁ
pĕdavi dāḍi ĕdanu mīḍe prema baṁdhaṁ nāgu sŏṁtaṁ
inni rāgālu u u u
inni rāgālu nīgu aṁdiṁche rāgame nenoyi
anurāgame nīvoyi anurāgame nīvoyi

o jābilī vĕnnĕla āgāśhaṁ unnade nīgosaṁ