O bangaru ramgula silugaa....

ఓ బంగరు రంగుల చిలుకా....
Year
Language

పల్లవి:

ఓ బంగరు రంగుల చిలకా పలకవా..ఆ...ఆ..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..ఈ..ఈ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

చరణం 1:

పంజరాన్ని దాటుకునీ..
బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..

చరణం 2:

సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే....

pallavi:

o baṁgaru raṁgula silagā palagavā..ā...ā..ā..
o allari sūbula rājā emanī..ī..ī..
nā mīda preme uṁdanī..nā paina alage ledanī

o allari sūbula rājā palagavā
o baṁgaru raṁgula silagā emanī ....
nā mīda preme uṁdanī..nā paina alage ledanī

saraṇaṁ 1:

paṁjarānni dāḍugunī..
baṁdhanālu tĕṁchugunī..nī kosaṁ vachchā āśhado
meḍaloni silagammā..middĕloni bullĕmmā..
nirubedanu valasāvĕṁduge
nī seruvalo.. nī sedulalo.. pulagiṁcheḍaṁduge ..

saraṇaṁ 2:

sannajāji tīguṁdi..tīga mīda puvvuṁdi..
puvvuloni navve nādile
kŏṁṭĕ tummĕdŏchchiṁdi..juṁṭi tenĕ koriṁdi..
aṁdiṁche bhāgyaṁ nādile
ī kŏṁḍallo..ī konallo..managĕdure ledule....