పల్లవి:
నువ్వూ నేనూ ఏకమైనాము...
నువ్వూ నేనూ ఏకమైనాము...
ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ...
లోకమంతా ఏకమైనా వేరు కాలేము...వేరు కాలేము...
నువ్వూ నేనూ ఏకమైనాము....
చరణం 1:
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము...
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము...
పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము...ఊ..ఉ..
అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుంద్దాము...ఊ..ఉ..
నువ్వూ నేనూ ఏకమైనాము....
చరణం 2:
చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము...
కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము...ఊ..
ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము...
ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ...ఊ..ఊ..
నువ్వూ నేనూ ఏకమైనాము....
చరణం 3:
లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ...ఊ..
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు...
లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ...ఊ..
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు...
సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము...ఊ..ఊ..
అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము...
నువ్వూ నేనూ ఏకమైనాము...
ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ...
లోకమంతా ఏకమైనా వేరు కాలేము...వేరు కాలేము...
నువ్వూ నేనూ ఏకమైనాము....ఆహ..హా..ఆహ..ఆహ..హా...
pallavi:
nuvvū nenū egamaināmu...
nuvvū nenū egamaināmu...
iddaramu...manamiddaramu ŏga logamaināmū...
logamaṁtā egamainā veru kālemu...veru kālemu...
nuvvū nenū egamaināmu....
saraṇaṁ 1:
kaḽḽu nālugu kalibi manamū illu kaḍaddāmū...
aṁdulo mana salla sallani valabu dībaṁ nilubuguṁddāmu...
kaḽḽu nālugu kalibi manamū illu kaḍaddāmū...
aṁdulo mana salla sallani valabu dībaṁ nilubuguṁddāmu...
pasiḍi manasulu paṭṭĕmaṁchaṁ vesuguṁddāmu...ū..u..
aṁdulo mana paḍusu korgĕla mallĕbūlu parusuguṁddāmu...ū..u..
nuvvū nenū egamaināmu....
saraṇaṁ 2:
sĕlimido ŏga saluvabaṁdiri vesuguṁddāmu...
kalala tīgala allibilligā alluguṁddāmu...ū..
ā alligalanu mana jīvidālagu polsuguṁddāmu...
e pŏddu kānī vāḍibonī puvvulavuddāmū...ū..ū..
nuvvū nenū egamaināmu....
saraṇaṁ 3:
leda vĕnnĕla salladanamu nuvvu tĕstāvū...ū..
aṁdulo nīrĕṁḍaloni vĕchchadanamu nuvvu istāvu...
leda vĕnnĕla salladanamu nuvvu tĕstāvū...ū..
aṁdulo nīrĕṁḍaloni vĕchchadanamu nuvvu istāvu...
sūryasaṁdrulu leni jagadini sṛṣhṭi seddāmu...ū..ū..
aṁdulo ī sṛṣhṭigĕnnaḍu leni sŏgasu manamu tĕddāmu...
nuvvū nenū egamaināmu...
iddaramu...manamiddaramu ŏga logamaināmū...
logamaṁtā egamainā veru kālemu...veru kālemu...
nuvvū nenū egamaināmu....āha..hā..āha..āha..hā...