నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా...
పల్లవి:
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా
చరణం 1:
నిన్నేనా అది నేనేనా
కల గన్నానా కనుగొన్నానా ||2||
అల్లిబిల్లి పదమల్లేనా
అది అందాల పందిరి వేసేనా ||2||
చరణం 2:
కళ్ళేనా...
కళ్ళేనా హరివిల్లేనా
అది చూపేనా విరితూపేనా ||2||
తుళ్ళీ తుళ్ళీ పడు వయసేనా
నను తొందర వందర చేసేనా ||2||
చరణం 3:
నువ్వైనా నీ నీడైనా
ఏ నాడైనా నా తోడౌనా ||2||
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా
ఇలా మల్లెల మాపై విచ్చేనా ||2||
pallavi:
nuvvenā saṁpaṁgi puvvuna nuvvenā
jābili navvula nuvvenā
godāri pŏṁguna nuvvenā nuvvenā
saraṇaṁ 1:
ninnenā adi nenenā
kala gannānā kanugŏnnānā ||2||
allibilli padamallenā
adi aṁdāla paṁdiri vesenā ||2||
saraṇaṁ 2:
kaḽḽenā...
kaḽḽenā harivillenā
adi sūbenā viridūbenā ||2||
tuḽḽī tuḽḽī paḍu vayasenā
nanu tŏṁdara vaṁdara sesenā ||2||
saraṇaṁ 3:
nuvvainā nī nīḍainā
e nāḍainā nā toḍaunā ||2||
maḽḽī maḽḽī kala vachchenā
ilā mallĕla mābai vichchenā ||2||