పల్లవి:
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
చరణం 1:
మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు
కలలేనా కన్నీరేనా
ఆ ఆ.. తేనెటీగలాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
చరణం 2:
ఆ. ఆ. కోయిలల్లె వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతు లోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
ఆ. ఆ. మసక వెన్నెలల్లె నీవు ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత గుసుగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా.. ఆనందమేనా..
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
pallavi:
nuvvenā nā nuvvenā
nuvvenā nāgu nuvvenā
sūryuḍalle sūdi guchche suprabhādamenā
māḍalāḍe sūbulanni maunarāgamenā
seruvainā dūramainā ānaṁdamenā
seruvainā dūramainā ānaṁdamenā
ānaṁdamenā.. ānaṁdamenā..
nuvvenā nā nuvvenā
nuvvenā nāgu nuvvenā
saraṇaṁ 1:
meghamallĕ sāgi vachchi dāhamedo pĕṁchudāvu
nīru guṁḍĕlona dāsi mĕrisi māyamavudāvu
kalalenā kannīrenā
ā ā.. tenĕḍīgalāga kuṭṭi tībi maṁṭa rebudāvu
puvvulāṁṭi guṁḍĕlona dāramalle dāgudāvu
nenenā nī rūbenā
seruvainā dūramainā ānaṁdamenā
seruvainā dūramainā ānaṁdamenā
ānaṁdamenā.. ānaṁdamenā..
nuvvenā nā nuvvenā
nuvvenā nāgu nuvvenā
saraṇaṁ 2:
ā. ā. koyilallĕ vachchi edo kŏtta pāḍa nerbudāvu
kŏmma gŏṁtu lona guṁḍĕ kŏṭṭuguṁṭe navvudāvu
e rāgaṁ idi e tāḽaṁ
ā. ā. masaga vĕnnĕlallĕ nīvu isaga tinnĕ serudāvu
gasagasāla kaugiliṁta gusugusallĕ mārudāvu
premaṁṭe nī premenā
seruvainā dūramainā ānaṁdamenā
seruvainā dūramainā ānaṁdamenā
ānaṁdamenā.. ānaṁdamenā..
nuvvenā nā nuvvenā
nuvvenā nāgu nuvvenā