పల్లవి:
అహ క్కొ క్కొ క్కొ కనిపెట్ట అన్నిటికీ ఒకటే మాటా షుకురియా షుకురియా
అరే చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టెయ్ ఆటాపాటా షుకురియా
అహ క్కొ క్కొ క్కొ కనిపెట్ట అన్నిటికీ ఒకటే మాటా షుకురియా షుకురియా
అరే చిక్ చిక్ చిక్ చిక్ బేటా మొదలెట్టెయ్ ఆటాపాటా షుకురియా
సోడాలకి ముఖ్యం గోళి
పెళ్ళాలకి ముఖ్యం తాళి
ఉండాలోయ్ పెన్నుకి పాళీ
షుకురియా షుకురియా షుకురియా
అహ క్కొ క్కొ క్కొ కనిపెట్ట అన్నిటికీ ఒకటే మాటా షుకురియా షుకురియా షుకురియా
చరణం 1:
హైటెక్కు సర్కారొస్తే నాయుడుబావకి షుకురియా
బియ్యంధర పెరిగిందండోయ్ బీజేపీ కీ బోలో షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
ఎగ్జాంస్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుకురియా
కాన్వెంట్లో ఎల్కేజీ కి లక్షలు అడిగితే బోలో
షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
వంటింట్లో గ్యాసైపోతే కుంపటి తల్లికి షుకురియా
కాసులకోసం క్రికెట్ మ్యాచ్ ఓడే ఘనులకు షుకురియా
చీరలు కట్టే హీరోయిన్ రిబ్బను కడితే షుకురియా
వేసిన ఫిల్మే వేసే టీ వీ చానల్సుకి షుకురియా
షుకురియా ఆ ఆ ఆ ఆ..... ||క్కొ క్కొ క్కొ||
చరణం 2:
గళ్ ఫ్రెండుని కలిసేప్పుడు వాళ్ళన్నయ్యొస్తే షుకురియా
పెళ్ళాము అనుకొని మరదలి చెయ్యట్టేస్తే బోలో షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
ఏజైన యాక్టర్లందరు ఎంపీలైతే షుకురియా
పెళ్ళాలని గద్దెక్కించే చాలూగాళ్ళకి బోలో షుకురియా షుకురియా
షుకురియా షుకురియా
పట్టాలకి డైవొర్సిచ్చే రైళ్ళకి బోలో షుకురియా
బస్సుల్ని పడవలు చేసే ఆర్టీసీకీ షుకురియా
నెలజీతం సరుకుల సంచిని నింపిందంటే షుకురియా
తొలివారం అప్పుల్లేక గడిచిందంటే షుకురియా
షుకురియా ఆ ఆ ఆ ఆ... ||అహ క్కొ క్కొ క్కొ||