Nuvu soodoo soodagabo

నువు చూడూ చూడకపో
Year
Language

పల్లవి:

నువు చూడూ చూడకపో...
నువు చూడూ చూడకపో... నే చూస్తూనే ఉంటా..
మాట్టాడూ ..ఆడకపో... మాట్టాడుతునే ఉంటా..
ప్రేమించూ.. మించకపో... ప్రేమిస్తూనే ఉంటా..
నా ప్రాణం.. నా ధ్యానం... నువ్వే లెమ్మంటా...
నువు చూడూ.. చూడకపో... నే చూస్తూనే ఉంటా

చరణం 1:

నువు తిట్టినా.. నీ నోటివెంట నా పేరొచ్చిందని సంబరపడతా...
నువు కొట్టినా... నా చెంపమీద నీ గురుతొకటుందని సంతోషిస్తా..
మనసుపువ్వును అందించానూ...
కొప్పులో నిలుపుకుంటావో... కాలికింద నలిపేస్తావో...
వలపు గువ్వనూ పంపించానూ..
బొట్టు పెట్టి రమ్మంటావో... గొంతు పట్టి గెంటేస్తావో…
ఏంచేసినా ..ఎవరాపినా.. చేసేది చేస్తుంటా ...

నువు చూడూ చూడకపో... నే చూస్తూనే ఉంటా..
మాట్టాడూ ..ఆడకపో... మాట్టాడుతునే ఉంటా..

చరణం 2:

పూజించడం... పూజారివంతు
వరమివ్వడమన్నది ...దేవత ఇష్టం
ప్రేమించడం... ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది... ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో...
చిన్ని మనసుకే తెలియదుగా ...నిన్ను మరవడం జరగదుగా..
ఎందువల్ల నువు కాదన్నావో...
ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా... ఎదురు చూపులే ఆపనుగా ...
ఏనాటికో... ఒకనాటికి ...నీ ప్రేమ సాధిస్తా

చరణం 3:

నిను చూడాలని ఉన్నా...
నిను చూడాలని ఉన్నా...నే చూడలేకున్నా
మాట్టాడాలని ఉన్నా...మాట్టాడలేకున్నా..
ప్రేమించాలని ఉన్నా...ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా

pallavi:

nuvu sūḍū sūḍagabo...
nuvu sūḍū sūḍagabo... ne sūstūne uṁṭā..
māṭṭāḍū ..āḍagabo... māṭṭāḍudune uṁṭā..
premiṁchū.. miṁchagabo... premistūne uṁṭā..
nā prāṇaṁ.. nā dhyānaṁ... nuvve lĕmmaṁṭā...
nuvu sūḍū.. sūḍagabo... ne sūstūne uṁṭā

saraṇaṁ 1:

nuvu tiṭṭinā.. nī noḍivĕṁṭa nā perŏchchiṁdani saṁbarabaḍadā...
nuvu kŏṭṭinā... nā sĕṁpamīda nī gurudŏgaḍuṁdani saṁtoṣhistā..
manasubuvvunu aṁdiṁchānū...
kŏppulo nilubuguṁṭāvo... kāligiṁda nalibestāvo...
valabu guvvanū paṁpiṁchānū..
bŏṭṭu pĕṭṭi rammaṁṭāvo... gŏṁtu paṭṭi gĕṁṭestāvo…
eṁchesinā ..ĕvarābinā.. sesedi sestuṁṭā ...

nuvu sūḍū sūḍagabo... ne sūstūne uṁṭā..
māṭṭāḍū ..āḍagabo... māṭṭāḍudune uṁṭā..

saraṇaṁ 2:

pūjiṁchaḍaṁ... pūjārivaṁtu
varamivvaḍamannadi ...devada iṣhṭaṁ
premiṁchaḍaṁ... premiguḍi vaṁtu
karuṇiṁchaḍamannadi... preyasi iṣhṭaṁ
ĕṁduvalla ninu premiṁchiṁdo...
sinni manasuge tĕliyadugā ...ninnu maravaḍaṁ jaragadugā..
ĕṁduvalla nuvu kādannāvo...
ĕduru praśhnale vĕyyanugā... ĕduru sūbule ābanugā ...
enāḍigo... ŏganāḍigi ...nī prema sādhistā

saraṇaṁ 3:

ninu sūḍālani unnā...
ninu sūḍālani unnā...ne sūḍalegunnā
māṭṭāḍālani unnā...māṭṭāḍalegunnā..
premiṁchālani unnā...premiṁchalegunnā
lolonā nālonā kannīravudunnā