Title (Indic)ఇన్నాళ్లూ నెఱఁగము నీ వింతటివాఁడవౌత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నాళ్లూ నెఱఁగము నీ వింతటివాఁడవౌత పన్నుక యెవ్వతె నిన్నుఁ బనుపరచినదో (॥ఇన్నా॥) మాపుదాఁకా నేరుపులే మాతోఁ బచరించేవు యే పళ్లిఁ జదివితివో యింతేసి నీవు రాఁపుగా జాణతనాలు రామలతో నాడేవు చేపట్టి యెవ్వతె నీకు సెలవులు వెట్టెవో (॥ఇన్నా॥) పూనుకొని యెందుకైనా పొసఁగ మాఁటాడేవు యే నెలఁత నేరిపెనో యింతేసి నీకు నానఁబెట్టి నానఁబెట్టి నవ్వులు నవ్వ వచ్చేవు సేనగా నీ కలవాటు సేసినది యెవ్వతో (॥ఇన్నా॥) అందుకోలువలపులు అమ్మవచ్చే వప్పటిని యెందు బేరాలాడితివో యింతేసి నీవు కందువ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి పొంది నిన్ను నెవ్వతె పోరచి మరపెనో English(||pallavi||) innāḽlū nĕṟam̐gamu nī viṁtaḍivām̐ḍavauda pannuga yĕvvadĕ ninnum̐ banubarasinado (||innā||) mābudām̐kā nerubule mādom̐ basariṁchevu ye paḽlim̐ jadividivo yiṁtesi nīvu rām̐pugā jāṇadanālu rāmalado nāḍevu sebaṭṭi yĕvvadĕ nīgu sĕlavulu vĕṭṭĕvo (||innā||) pūnugŏni yĕṁdugainā pŏsam̐ga mām̐ṭāḍevu ye nĕlam̐ta neribĕno yiṁtesi nīgu nānam̐bĕṭṭi nānam̐bĕṭṭi navvulu navva vachchevu senagā nī kalavāḍu sesinadi yĕvvado (||innā||) aṁdugoluvalabulu ammavachche vappaḍini yĕṁdu berālāḍidivo yiṁtesi nīvu kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi pŏṁdi ninnu nĕvvadĕ porasi marabĕno