Title (Indic)ఎందుకైనాఁ దానేవచ్చీ నేమిసేతునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎందుకైనాఁ దానేవచ్చీ నేమిసేతునే యిందరివాఁడూఁ దానే యేమిసేతునే (॥ఎందు॥) గద్దరి సవతులము కాఁతాళాన నుండఁగాను యిద్దరి నొక్కటిసేసీ నేమిసేతునే పెద్దరికాన నొటు పెట్టుకుండఁగా నిదె వద్దన్నా బొత్తులఁబెట్టీ వడి నేమిసేతునే (॥ఎందు॥) చయ్యాటపుమాటలు సారెసారె నాడఁగాను యియ్యకోళ్లుగాఁ జెప్పీ నేమిసేతునే కయ్యములు వద్దంటా గక్కనఁ బ్రియాలు చెప్పి ఇయ్యరానిబాసలెల్లా నిచ్చీనేమిసేతునే (॥ఎందు॥) మరిగి మాఁటు సేసుక మామాఇండ్ల నుండఁగా ఇరుమేలాఁ బెట్టుకొనీ నేమిసేతునే అరుదై శ్రీవేంకటేశుఁ డక్క చెల్లెండ్లము మ మ్మిరవుగాఁ బెండ్లాడె సేమిసేతునే English(||pallavi||) ĕṁdugainām̐ dānevachchī nemisedune yiṁdarivām̐ḍūm̐ dāne yemisedune (||ĕṁdu||) gaddari savadulamu kām̐tāḽāna nuṁḍam̐gānu yiddari nŏkkaḍisesī nemisedune pĕddarigāna nŏḍu pĕṭṭuguṁḍam̐gā nidĕ vaddannā bŏttulam̐bĕṭṭī vaḍi nemisedune (||ĕṁdu||) sayyāḍabumāḍalu sārĕsārĕ nāḍam̐gānu yiyyagoḽlugām̐ jĕppī nemisedune kayyamulu vaddaṁṭā gakkanam̐ briyālu sĕppi iyyarānibāsalĕllā nichchīnemisedune (||ĕṁdu||) marigi mām̐ṭu sesuga māmāiṁḍla nuṁḍam̐gā irumelām̐ bĕṭṭugŏnī nemisedune arudai śhrīveṁkaḍeśhum̐ ḍakka sĕllĕṁḍlamu ma mmiravugām̐ bĕṁḍlāḍĕ semisedune