Title (Indic)కడు ముద్దరాలు గన కక్కసించ నోపదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కడు ముద్దరాలు గన కక్కసించ నోపదు వడిఁ బెట్ట కిఁక నిట్టె వర మియ్యవయ్యా (॥కడు॥) నిన్నుఁ జూచి నవ్వు నవ్వి నివ్వెరగుఁ బొందెఁ జెలి సన్నలు నీకే తెలుసు సరసుఁడవు విన్నపము నేనే నంటె వెలది చిత్త మెఱఁగ వున్నతి చెలి మోహము వొప్పు గొనవయ్యా (॥కడు॥) అప్పసము చేయి చాఁచి ఆయములు గరఁగె యీ చొప్పు నీవె యెరుఁగుదు సుజాణఁడవు అప్పటిఁ గొసరే మంటె ఆపెమర్మ మెరఁగము చిప్పిలువయసు నీకే సెలవు సుమ్మయ్యా (॥కడు॥) మేరతో దగ్గరుతానె మెచ్చె నిన్నిటా నీకె ఆ రతి నీ వెరుఁగుదు వధికుఁడవు కూరిమి శ్రీవెంకటేశ కూడితివి మగువను నేరుతుమా నే మంత నీనే రక్షించవయ్యా English(||pallavi||) kaḍu muddarālu gana kakkasiṁcha nobadu vaḍim̐ bĕṭṭa kim̐ka niṭṭĕ vara miyyavayyā (||kaḍu||) ninnum̐ jūsi navvu navvi nivvĕragum̐ bŏṁdĕm̐ jĕli sannalu nīge tĕlusu sarasum̐ḍavu vinnabamu nene naṁṭĕ vĕladi sitta mĕṟam̐ga vunnadi sĕli mohamu vŏppu gŏnavayyā (||kaḍu||) appasamu seyi sām̐si āyamulu garam̐gĕ yī sŏppu nīvĕ yĕrum̐gudu sujāṇam̐ḍavu appaḍim̐ gŏsare maṁṭĕ ābĕmarma mĕram̐gamu sippiluvayasu nīge sĕlavu summayyā (||kaḍu||) merado daggarudānĕ mĕchchĕ ninniḍā nīgĕ ā radi nī vĕrum̐gudu vadhigum̐ḍavu kūrimi śhrīvĕṁkaḍeśha kūḍidivi maguvanu nerudumā ne maṁta nīne rakṣhiṁchavayyā