Title (Indic)అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి వంతుకు వాసికి నతనివాఁడనంటేఁ జాలు (॥అంత॥) బంతిఁగట్టి నురిపేటి పసురము లెడ నెడఁ బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు చెంతల సంసారము సేయు నరుఁడందులోనె కొంత గొంత హరి నాత్మఁ గొలుచుటే చాలు (॥అంత॥) వరుసఁ జేఁదు దినేవాడు యెడ నెడఁ గొంత సరవితోడుతఁ దీపు చవిగొన్నట్టు దురితవిధులు సేసి దుఃఖించు మానవుఁడు తరవాత హరిపేరు దలఁచుటే చాలు (॥అంత॥) కడుఁ బేదైనవాఁడు కాలకర్మవశమున అడుగులోనే నిధాన మటు గన్నట్టు యెడసి శ్రీవేంకటేశు నెరఁగక గురునాజ్ఞ పొడగన్నవానిభక్తి పొడముటే చాలు English(||pallavi||) aṁtaḍane vachchi kāsu nābadbaṁdhum̐ḍu hari vaṁtugu vāsigi nadanivām̐ḍanaṁṭem̐ jālu (||aṁta||) baṁtim̐gaṭṭi nuribeḍi pasuramu lĕḍa nĕḍam̐ bŏṁta nŏkkŏkka gavuga vuchchugŏnnaṭṭu sĕṁtala saṁsāramu seyu narum̐ḍaṁdulonĕ kŏṁta gŏṁta hari nātmam̐ gŏlusuḍe sālu (||aṁta||) varusam̐ jem̐du dinevāḍu yĕḍa nĕḍam̐ gŏṁta saravidoḍudam̐ dību savigŏnnaṭṭu duridavidhulu sesi duḥkhiṁchu mānavum̐ḍu taravāda hariberu dalam̐suḍe sālu (||aṁta||) kaḍum̐ bedainavām̐ḍu kālagarmavaśhamuna aḍugulone nidhāna maḍu gannaṭṭu yĕḍasi śhrīveṁkaḍeśhu nĕram̐gaga gurunājña pŏḍagannavānibhakti pŏḍamuḍe sālu