Title (Indic)కాదనేమా నిన్నును కడు మెచ్చే మింతే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేమా నిన్నును కడు మెచ్చే మింతే కాక సాదించితివి వలపు జాణకాఁడ వవుదువు (॥కాద॥) నయగారి మాటలెల్ల నాకుఁగా నేరిచితివి క్రియ లెరుఁగుకొంటివి గేస్తురాండ్లలకు దయదలఁతువు నీవు తరుణులైతేఁ జాలు జయములే యెప్పుడును జాణకాఁడ వౌదువు (॥కాద॥) నగవులు సెలవుల నాకుఁగాఁ దెచ్చుకొంటివి అగపడితి వట్టె పదారువేలకు జిగిమించు గొల్లెతల సిగ్గులకు లోనైతివి జగడము లేదు నీకు జాణకాఁడ వౌదువు (॥కాద॥) నంటున కాఁగిటఁ గూడి నాకే లోనైతివి అంటక బాఁ పెతలవిం దారగించితి వెంటెనె శ్రీ వేంకటేశ వేడుకకాఁడవై జంటవాయ విటు నన్ను జాణకాఁడ వౌదువు English(||pallavi||) kādanemā ninnunu kaḍu mĕchche miṁte kāga sādiṁchidivi valabu jāṇagām̐ḍa vavuduvu (||kāda||) nayagāri māḍalĕlla nāgum̐gā nerisidivi kriya lĕrum̐gugŏṁṭivi gesturāṁḍlalagu dayadalam̐tuvu nīvu taruṇulaidem̐ jālu jayamule yĕppuḍunu jāṇagām̐ḍa vauduvu (||kāda||) nagavulu sĕlavula nāgum̐gām̐ dĕchchugŏṁṭivi agabaḍidi vaṭṭĕ padāruvelagu jigimiṁchu gŏllĕdala siggulagu lonaidivi jagaḍamu ledu nīgu jāṇagām̐ḍa vauduvu (||kāda||) naṁṭuna kām̐giḍam̐ gūḍi nāge lonaidivi aṁṭaga bām̐ pĕdalaviṁ dāragiṁchidi vĕṁṭĕnĕ śhrī veṁkaḍeśha veḍugagām̐ḍavai jaṁṭavāya viḍu nannu jāṇagām̐ḍa vauduvu