Title (Indic)వట్టిగుట్టు సేసుకొని వలపించ వచ్చితిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వట్టిగుట్టు సేసుకొని వలపించ వచ్చితిని బట్టబయలు నవ్వితే భ్రమసునా విభుఁడు (॥వట్టి॥) చేయఁగలసేవలు సేసి చూపవలెఁగాక చాయసేసుకుండితేను సమ్మతులౌనా పాయపుదాననంటాను పానుపుపై నుంటేను కాయజకేలిని యెట్టు గరఁగునే విభుఁడు (॥వట్టి॥) మనసులోఁగలమాట మందలించవలెఁగాక తనలోనే దాఁచుకొంటే తారుకాణౌనా మనవైనయాలనంటా మాకువలె నుంటేను తనివోనిరతి నెట్టు దరించునే విభుఁడు (॥వట్టి॥) అలమేల్ మంగచెల్లెల నైననావలెనే కూడ- వలెఁగాక గోలవైతే వసమయ్యీనా కలయుచో సిగ్గునఁ గాఁగిలించు కుండితేను చెలఁగి యెట్టు చిక్కునే శ్రీవేంకటవిభుఁడు English(||pallavi||) vaṭṭiguṭṭu sesugŏni valabiṁcha vachchidini baṭṭabayalu navvide bhramasunā vibhum̐ḍu (||vaṭṭi||) seyam̐galasevalu sesi sūbavalĕm̐gāga sāyasesuguṁḍidenu sammadulaunā pāyabudānanaṁṭānu pānububai nuṁṭenu kāyajagelini yĕṭṭu garam̐gune vibhum̐ḍu (||vaṭṭi||) manasulom̐galamāḍa maṁdaliṁchavalĕm̐gāga tanalone dām̐sugŏṁṭe tārugāṇaunā manavainayālanaṁṭā māguvalĕ nuṁṭenu tanivoniradi nĕṭṭu dariṁchune vibhum̐ḍu (||vaṭṭi||) alamel maṁgasĕllĕla nainanāvalĕne kūḍa- valĕm̐gāga golavaide vasamayyīnā kalayuso siggunam̐ gām̐giliṁchu kuṁḍidenu sĕlam̐gi yĕṭṭu sikkune śhrīveṁkaḍavibhum̐ḍu