Title (Indic)ఇంకా నెందాఁకా మాట లిటువంటివే కాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంకా నెందాఁకా మాట లిటువంటివే కాదా తెంకి నీ గుణాలు నేఁడు తేటతెల్లమాయరా (॥ఇంకా॥) కొప్పున సంపెంగలు కోరి నీకు ముడిచితి యిప్పుడే సేవంతు లున్నవి వేడవిరా నెప్పున విత్తులలోన నిండెమల్లె లన్నట్లా చెప్పఁ గొత్తలాయ దానిచేఁతలు నా కిదివో (॥ఇంకా॥) నిరతిలో పదకము నీ మెడఁ బెట్టితి నింతే అరిధిఁ గంటమాలున్న దదేడదిరా ధర విత్తొకటి వెట్టఁ దా జెట్టొక టైనట్టు యిరవైన నీచేఁత లిందే కంటిమిరా (॥ఇంకా॥) చెలరేఁగి కస్తూరి చెక్కిటఁ బూసితి నింతే యెలమిఁ దట్టుపుణుఁగు యేల వచ్చెరా కలసి కల్ల నిజము గాడిఁగట్టినట్లాయ నెలవై శ్రీవేంకటేశ నిను నేఁ గూడితిరా English(||pallavi||) iṁkā nĕṁdām̐kā māḍa liḍuvaṁṭive kādā tĕṁki nī guṇālu nem̐ḍu teḍadĕllamāyarā (||iṁkā||) kŏppuna saṁpĕṁgalu kori nīgu muḍisidi yippuḍe sevaṁtu lunnavi veḍavirā nĕppuna vittulalona niṁḍĕmallĕ lannaṭlā sĕppam̐ gŏttalāya dānisem̐talu nā kidivo (||iṁkā||) niradilo padagamu nī mĕḍam̐ bĕṭṭidi niṁte aridhim̐ gaṁṭamālunna dadeḍadirā dhara vittŏgaḍi vĕṭṭam̐ dā jĕṭṭŏga ṭainaṭṭu yiravaina nīsem̐ta liṁde kaṁṭimirā (||iṁkā||) sĕlarem̐gi kastūri sĕkkiḍam̐ būsidi niṁte yĕlamim̐ daṭṭubuṇum̐gu yela vachchĕrā kalasi kalla nijamu gāḍim̐gaṭṭinaṭlāya nĕlavai śhrīveṁkaḍeśha ninu nem̐ gūḍidirā