Title (Indic)అంగడిఁ బెట్టేవు మమ్ము నౌనోయి బావ నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అంగడిఁ బెట్టేవు మమ్ము నౌనోయి బావ నీ- ఇంగితము లెల్లాఁ గంటి మింకానా బావా (॥అంగ॥) సారె నీరాటి రేవులజాణత నాలా బావ గోరికొనకు లోఁగాని గొంటరిబావ కోర సోఁకీ వలపులు గుద్దలించేవా బావ రారాదా మానికింద రచ్చసేసేబావా (॥అంగ॥) కందువ నెందుకునైనాఁ గాలు చాఁచే విట్టే బావ చెంది సూడుకుఁ బాడుకుఁ జిమ్మేటిబావ విందువలె నాఁటదాని వెదకి వచ్చేటిబావా నిందలు నీపై మోఁచేనీవారమో బావా (॥అంగ॥) యెగ్గు సిగ్గు లెరఁగవు ఇది యేఁటి దోయి బావ వెగ్గళించేవు కలికివిద్యల బావ అగ్గమై శ్రీవేంకటేశ అట్లానే నన్నుఁ గూడి నిగ్గుదేర మన్నించితి నీవే నే నోబావా English(||pallavi||) aṁgaḍim̐ bĕṭṭevu mammu naunoyi bāva nī- iṁgidamu lĕllām̐ gaṁṭi miṁkānā bāvā (||aṁga||) sārĕ nīrāḍi revulajāṇada nālā bāva gorigŏnagu lom̐gāni gŏṁṭaribāva kora som̐kī valabulu guddaliṁchevā bāva rārādā mānigiṁda rachchasesebāvā (||aṁga||) kaṁduva nĕṁdugunainām̐ gālu sām̐se viṭṭe bāva sĕṁdi sūḍugum̐ bāḍugum̐ jimmeḍibāva viṁduvalĕ nām̐ṭadāni vĕdagi vachcheḍibāvā niṁdalu nībai mom̐senīvāramo bāvā (||aṁga||) yĕggu siggu lĕram̐gavu idi yem̐ṭi doyi bāva vĕggaḽiṁchevu kaligividyala bāva aggamai śhrīveṁkaḍeśha aṭlāne nannum̐ gūḍi niggudera manniṁchidi nīve ne nobāvā