Title (Indic)ఏల సిగ్గులు వడేవు యిందరిలోన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏల సిగ్గులు వడేవు యిందరిలోన పాలిండ్లు చూపి నాపె బాఁతిపడి వున్నది (॥ఏల॥) దీకొని మోమైనాను దిట్టించి చూడరాదా నీకు మొక్కినాపె యిట్టె నిలుచున్నది మైకొని వూరకే మంచిమాటైనానాడరాదా ఆకుమడిచిచ్చినాపె ఆసపడియున్నది (॥ఏల॥) ఆనుకొని పరిణామమైన నడుగరాదా కానుకలిచ్చినయాపె కాచుకున్నది నానఁబెట్టి సెలవుల నవ్వైనా నవ్వఁగరాదా పూని సన్నసేసినాపె పొలయుచున్నది (॥ఏల॥) కొంగువట్టి రతులకు గురుతు చెప్పఁగరాదా వుంగరమువట్టినాపె వొద్దనున్నది చెంగట శ్రీ వెంకటేశ చేరి నన్నుఁ గూడితివి యింగిత మెరిఁగినాపె యెదుటనే వున్నది English(||pallavi||) ela siggulu vaḍevu yiṁdarilona pāliṁḍlu sūbi nābĕ bām̐tibaḍi vunnadi (||ela||) dīgŏni momainānu diṭṭiṁchi sūḍarādā nīgu mŏkkinābĕ yiṭṭĕ nilusunnadi maigŏni vūrage maṁchimāḍainānāḍarādā āgumaḍisichchinābĕ āsabaḍiyunnadi (||ela||) ānugŏni pariṇāmamaina naḍugarādā kānugalichchinayābĕ kāsugunnadi nānam̐bĕṭṭi sĕlavula navvainā navvam̐garādā pūni sannasesinābĕ pŏlayusunnadi (||ela||) kŏṁguvaṭṭi radulagu gurudu sĕppam̐garādā vuṁgaramuvaṭṭinābĕ vŏddanunnadi sĕṁgaḍa śhrī vĕṁkaḍeśha seri nannum̐ gūḍidivi yiṁgida mĕrim̐ginābĕ yĕduḍane vunnadi