Title (Indic)దుప్పటెల్లా జవ్వాదినే తొప్పఁదోఁగె నీకడనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దుప్పటెల్లా జవ్వాదినే తొప్పఁదోఁగె నీకడనే వొప్పదా యింతేసి నీకు వో వలపా (॥దుప్ప॥) ఉత్తలపు విరహన నుడుకుచు వయసు మీఁ- దెత్తినది సతి నీకు నిందుకొరకా వత్తునని విచ్చేసి వనితల కుచముల వొత్తగిలి వున్నాఁడ వోహో వలపా (॥దుప్ప॥) నిదుర గంటకి రాక నెలఁత పానుపుమీఁద- నెదురు చూచీ నీకు నిందుకొరకా ముదితల కౌఁగిట ముంచిన కస్తూరి నీకు వుదిరెడి వురమున నో వలపా (॥దుప్ప॥) కన్నుల కలికి నింత కరఁగించి కవుఁగిట ఎన్నిక సేసితివి నీ విందుకొరకా చిన్ని చిన్న నగవుల శ్రీవేంకటేశ నీ- వున్నాఁడవొరపులై వోహో వలపా English(||pallavi||) duppaḍĕllā javvādine tŏppam̐dom̐gĕ nīgaḍane vŏppadā yiṁtesi nīgu vo valabā (||duppa||) uttalabu virahana nuḍugusu vayasu mīm̐- dĕttinadi sadi nīgu niṁdugŏragā vattunani vichchesi vanidala kusamula vŏttagili vunnām̐ḍa voho valabā (||duppa||) nidura gaṁṭagi rāga nĕlam̐ta pānubumīm̐da- nĕduru sūsī nīgu niṁdugŏragā mudidala kaum̐giḍa muṁchina kastūri nīgu vudirĕḍi vuramuna no valabā (||duppa||) kannula kaligi niṁta karam̐giṁchi kavum̐giḍa ĕnniga sesidivi nī viṁdugŏragā sinni sinna nagavula śhrīveṁkaḍeśha nī- vunnām̐ḍavŏrabulai voho valabā