Title (Indic)అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు కందర్పజనక నాకుఁ గలిగితి విన్నిటా (॥అంది॥) ఘనకుండలములు నీ కథలు నాచెవులకు ననుపైన రుచులు నీ నామములు నాలుకకు అనువై నీకు మొక్కఁగ నంటిన నొసలిమన్ను పనివడి నీకు పట్టబద్ధ(ంధ?)ము (॥అంది॥) మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు కాంచనపురాసి నీ చక్కని రూపు నామతికి పంచామృతములు నీ పాదతీర్థము మేనికి పంచినముద్ర లదే వజ్రాంగిజోడు (॥అంది॥) సకలబంధులు నీ దాసానదాసులే నాకు అకలంక జన్మఫల మన్నిటా నీకృప నాకు ప్రకటపు శ్రీవేంకటపతివి నాయాతుమలో మొకరివై యుండి నన్ను మోహించఁజేసితివి English(||pallavi||) aṁdidinim̐ bŏṁdidi nīyaṁ dakhilabhogamulu kaṁdarbajanaga nāgum̐ galigidi vinniḍā (||aṁdi||) ghanaguṁḍalamulu nī kathalu nāsĕvulagu nanubaina rusulu nī nāmamulu nālugagu anuvai nīgu mŏkkam̐ga naṁṭina nŏsalimannu panivaḍi nīgu paṭṭabaddha(ṁdha?)mu (||aṁdi||) maṁchi nirmālyabudaṁḍa maṁgaḽasūtramu nāgu kāṁchanaburāsi nī sakkani rūbu nāmadigi paṁchāmṛtamulu nī pādadīrdhamu menigi paṁchinamudra lade vajrāṁgijoḍu (||aṁdi||) sagalabaṁdhulu nī dāsānadāsule nāgu agalaṁka janmaphala manniḍā nīkṛpa nāgu pragaḍabu śhrīveṁkaḍabadivi nāyādumalo mŏgarivai yuṁḍi nannu mohiṁcham̐jesidivi