Title (Indic)సకలలోకనాథుఁడు జనార్దనుఁ డితఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సకలలోకనాథుఁడు జనార్దనుఁ డితఁడు శుకయోగివంద్యుని సుజ్ఞాన మెంత (॥సక॥) మరుని తండ్రికిని మఱి చక్కఁదనమెంత సిరిమగని భాగ్యము చెప్పనెంత పురుషోత్తము ఘనత పొగడఁగ నిఁక నెంత గరిమ జలధిశాయి గంభీర మెంత (॥సక॥) వేవేలు ముఖాలవాని నిగ్రహము చెప్ప నెంత భూవల్లభుని వోరుపు పోలించ నెంత వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజస మెంత యేవల్లఁ జక్రాయుధుని కెదురెంచ నెంత (॥సక॥) అమితవరదునికి ఔదార్యగుణ మెంత విమతాసురవైరివిక్రమ మెంత మమతల నలమేలుమంగపతి సొబ గెంత అమర శ్రీవేంకటేశు ఆధిక్య మెంత English(||pallavi||) sagalaloganāthum̐ḍu janārdanum̐ ḍidam̐ḍu śhugayogivaṁdyuni sujñāna mĕṁta (||saga||) maruni taṁḍrigini maṟi sakkam̐danamĕṁta sirimagani bhāgyamu sĕppanĕṁta puruṣhottamu ghanada pŏgaḍam̐ga nim̐ka nĕṁta garima jaladhiśhāyi gaṁbhīra mĕṁta (||saga||) vevelu mukhālavāni nigrahamu sĕppa nĕṁta bhūvallabhuni vorubu poliṁcha nĕṁta vāviri brahmadaṁḍrigi varṇiṁpa rājasa mĕṁta yevallam̐ jakrāyudhuni kĕdurĕṁcha nĕṁta (||saga||) amidavaradunigi audāryaguṇa mĕṁta vimadāsuravairivikrama mĕṁta mamadala nalamelumaṁgabadi sŏba gĕṁta amara śhrīveṁkaḍeśhu ādhikya mĕṁta