Title (Indic)ఐనట్టయ్యీఁ గాక హరికల్పితము లివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఐనట్టయ్యీఁ గాక హరికల్పితము లివి మానేటి వేఁటివో మానని వేవో (॥ఐన॥) వొక్కరు తలఁచినట్టు వొకరి తలఁపు రాదు పక్కన నందరికి బహుభావాలు అక్కట మొద లొకటి అనలుఁ గొనలు వేరు యెక్కడని తగిలేది యేమిసేసేది (॥ఐన॥) పొరుగువాని చేఁత ఆపొరుగువాఁడు మెచ్చఁడు నరుల కర్మములు నానావిధాలు గరిమ నన్నమొక్కటే కడుపుతనివి వేరు కరుణించౌనన నేవి కావన నేవి (॥ఐన॥) కడఁగి దరిద్రునిమాట కలవాని కింపుగాదు బెడఁగు జీవుల పొందు పెక్కురీతులు కడు శ్రీవేంకటేశుఁ డొక్కఁడు జగత్తులు వేరు వొడిఁగట్టుకొనే దేది వొల్లననే దేది English(||pallavi||) ainaṭṭayyīm̐ gāga harigalbidamu livi māneḍi vem̐ṭivo mānani vevo (||aina||) vŏkkaru talam̐sinaṭṭu vŏgari talam̐pu rādu pakkana naṁdarigi bahubhāvālu akkaḍa mŏda lŏgaḍi analum̐ gŏnalu veru yĕkkaḍani tagiledi yemisesedi (||aina||) pŏruguvāni sem̐ta ābŏruguvām̐ḍu mĕchcham̐ḍu narula karmamulu nānāvidhālu garima nannamŏkkaḍe kaḍubudanivi veru karuṇiṁchaunana nevi kāvana nevi (||aina||) kaḍam̐gi daridrunimāḍa kalavāni kiṁpugādu bĕḍam̐gu jīvula pŏṁdu pĕkkurīdulu kaḍu śhrīveṁkaḍeśhum̐ ḍŏkkam̐ḍu jagattulu veru vŏḍim̐gaṭṭugŏne dedi vŏllanane dedi