You are here

Nenamte ..naagu saalaane ishtam

Title (Indic)
నేనంటే ..నాకు చాలానే ఇష్టం
Work
Year
Language
Credits
Role Artist
Music Devi Sri Prasad
Performer Adnan Sami
Writer Ramajogayya Sastry

Lyrics

Telugu

పల్లవి:

నేనంటే.. నాకూ చాలానే ఇష్టం
నువ్వంటే ..ఇంకా ఇష్టం
హో ! ఏ చోటనైనా ఉన్నా.. నీకోసం
నా ప్రేమ పేరు ...నీలాకాశం
చెక్కిళ్ళు ఎరుపయ్యే.. ఓ ఓ.. సూరీడు చూపైనా.. ఓ ఓ..
నాచెయ్యి దాటందే నిను తాకదే.. చెలి
వెక్కిళ్ళు రప్పించే.. ఓ ఓ ..ఏ చిన్ని కలతైనా
నాకన్ను తప్పించి నిను చేరదే.. చెలీ ..చెలీ చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం .. నువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో

చరణం 1:

వీచేగాలీ నేను.. పోటీ పడుతుంటాం
పీల్చేశ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు.. సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తలమోసేలా.. హో హో
పూలన్నీ నీసొంతం ..ఓ ఓ.. ఊళ్ళన్నీ నాకోసం.. ఓ ఓ..
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం.. ఆదేగ నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చనా ..హో !

నేనంటే నాకు చాలానే ఇష్టం ...నువ్వంటే ఇంకా ఇష్టం

చరణం 2:

చేదు బాధ లేని లోకం ..నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాటా ఆడే బొమ్మై.. నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే ..నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే..టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని

నేనంటే నాకు చాలానే ఇష్టం ..నువ్వంటే ఇంకా ఇష్టం
హుం హుం హుం హే హే హే
హొ హొ హొ హుం హుం హుం

English

pallavi:

nenaṁṭe.. nāgū sālāne iṣhṭaṁ
nuvvaṁṭe ..iṁkā iṣhṭaṁ
ho ! e soḍanainā unnā.. nīgosaṁ
nā prema peru ...nīlāgāśhaṁ
sĕkkiḽḽu ĕrubayye.. o o.. sūrīḍu sūbainā.. o o..
nāsĕyyi dāḍaṁde ninu tāgade.. sĕli
vĕkkiḽḽu rappiṁche.. o o ..e sinni kaladainā
nāgannu tappiṁchi ninu serade.. sĕlī ..sĕlī sĕlī
nenaṁṭe nāgu sālāne iṣhṭaṁ .. nuvvaṁṭe iṁkā iṣhṭaṁ ho ho ho

saraṇaṁ 1:

vīsegālī nenu.. poḍī paḍuduṁṭāṁ
pīlseśhvāsai ninnu serelā
nela nenu roju.. sarduguboduṁṭāṁ
rāṇi pādālu talamoselā.. ho ho
pūlannī nīsŏṁtaṁ ..o o.. ūḽḽannī nāgosaṁ.. o o..
ĕṁḍalni digamiṁge nīḍanai unnā
e raṁgu nī nestaṁ.. ādega nā nestaṁ
nī navvugai nene raṁge mārsanā ..ho !

nenaṁṭe nāgu sālāne iṣhṭaṁ ...nuvvaṁṭe iṁkā iṣhṭaṁ

saraṇaṁ 2:

sedu bādha leni logaṁ ..nenavudā
nīdo pāḍe aṁdulo uṁṭā
āḍa pāḍā āḍe bŏmmai.. nenuṁṭā
nī saṁtoṣhaṁ pūsi nādaṁṭā
sinnāri pābalagu sinnāri ĕvaraṁṭe ..nīvaṁka sūbistā adugo anī
priyādi priyamaina prayāṇaṁ edaṁṭe..ṭagālani sĕppestā nīdo premani

nenaṁṭe nāgu sālāne iṣhṭaṁ ..nuvvaṁṭe iṁkā iṣhṭaṁ
huṁ huṁ huṁ he he he
hŏ hŏ hŏ huṁ huṁ huṁ

Lyrics search