Title (Indic)ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు WorkBhadra Year2005 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Ravivarma Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే.. మరిచి.. బ్రతకాలే మనసా... ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చరణం 1: ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన ఋణమనుకో మిగిలే.. స్మృతులే.. వరమనుకో మనసా. చరణం 2: తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్నీ కోరదుగా కడలిలోనె ఆగుతుందా కదలనంటూ ఏ పయనం వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం కరిగే.. కలలే.. తరిమే ఓ మనసా... Englishpallavi: o manasā o manasā sĕbide vinavā nuvvu nī mamade māya kadā nijame kanavā nuvvu sĕliya guṁḍĕ tāgalega palaganaṁde nā maunaṁ sĕlimi vĕṁṭa sāgalega śhila ayiṁde nā prāṇaṁ gadame.. marisi.. bradagāle manasā... o manasā o manasā sĕbide vinavā nuvvu nī mamade māya kadā nijame kanavā nuvvu saraṇaṁ 1: ĕgasi paḍe ala kosaṁ digivastuṁdā āgāśhaṁ tabana paḍi eṁ lābhaṁ aṁdani jābili jada kosaṁ kalisi unna kŏṁta kālaṁ vĕnaga janma varamanugo kalisi rāni prema tīraṁ tīriboyina ṛṇamanugo migile.. smṛtule.. varamanugo manasā. saraṇaṁ 2: tana ŏḍilo pŏduvuguni bhadraṁgā naḍibe nauga tananŏdili vĕḽḽagani e baṁdhānnī koradugā kaḍalilonĕ āguduṁdā kadalanaṁṭū e payanaṁ vĕlugu vaibu sūḍanaṁdā nidara lese nā nayanaṁ karige.. kalale.. tarime o manasā...