You are here

Daasharathee... karunaa payonithi

Title (Indic)
దాశరథీ... కరుణా పయోనిథి
Work
Year
Language
Credits
Role Artist
Music M.M. Keeravani
Performer Balasubramaniam S.P.
Writer

Lyrics

Telugu

పల్లవి:

దాశరథీ... కరుణా పయోనిథి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజయించడమా
రామ కోటి రచియించడమా
సీతారామస్వామీ నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిథి

చరణం 1:

గుహుడు నీకు చుట్టమా?.. గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా?... ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా?.. నీ దర్శనమే ఇమ్మంటిని కాని
ఏల రావు?.. నన్నేలరావు?... నన్నేల ఏల ఏల రావు?
సీతా రామస్వామీ... సీతా రామస్వామీ నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శన మీయవిదేమి
దాశరథీ కరుణా పయోనిథి

చరణం 2:

రామ రసరమ్య రామ రమణీయ
రామ రఘువంశ సోమ రణరంగ భీమ
రాక్షస విరామ కమనీయ ధామ
సౌందర్య సీమ నీరdaశ్యామ నిజభుజోక్తామ
భోజనలలామ భువనజయ రామ పాహి భద్రాద్రి రామ పాహీ..

చరణం 3:

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాం డ డ డాండ డాండ నినదమ్ముల
జాండమునిండ మత్తవేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ
సుంగ శుభంగ రంగ బహురంగద
భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగ సత్య సారంగ సుశ్రుతివిహంగ పాప మృదు సంగ విభంగ
భూతల పతంగా... మధు మంగళ రూపమే చూపవేమిరా
గరుడగమన రారా ... గరుడగమన రారా ...

English

pallavi:

dāśharathī... karuṇā payonithi
nuvve dikkani nammaḍamā
nī ālayamunu nirmiṁchaḍamā
niradamu ninu bhajayiṁchaḍamā
rāma koḍi rasiyiṁchaḍamā
sīdārāmasvāmī ne sesina neramademi
nī daya sūbavademi nī darśhana mīyavidemi
dāśharathī karuṇā payonithi

saraṇaṁ 1:

guhuḍu nīgu suṭṭamā?.. guṁḍĕlagu hattugunnāvu
śhabari nīgu tobuṭṭuvā?... ĕṁgili paḽḽanu tinnāvu
nī rājyamu rāsimmaṁṭinā?.. nī darśhaname immaṁṭini kāni
ela rāvu?.. nannelarāvu?... nannela ela ela rāvu?
sīdā rāmasvāmī... sīdā rāmasvāmī ne sesina neramademi
nī daya sūbavademi nī darśhana mīyavidemi
dāśharathī karuṇā payonithi

saraṇaṁ 2:

rāma rasaramya rāma ramaṇīya
rāma raghuvaṁśha soma raṇaraṁga bhīma
rākṣhasa virāma kamanīya dhāma
sauṁdarya sīma nīradaśhyāma nijabhujoktāma
bhojanalalāma bhuvanajaya rāma pāhi bhadrādri rāma pāhī..

saraṇaṁ 3:

takṣhaṇa rakṣhaṇa viśhvavilakṣhaṇa dharma visakṣhaṇa godāri kalisĕnemirā
ḍāṁ ḍa ḍa ḍāṁḍa ḍāṁḍa ninadammula
jāṁḍamuniṁḍa mattavedaṁḍamu nĕkkine pŏgaḍu nī abhayavradamedirā
prema rasāṁtaraṁga hṛdayaṁgama
suṁga śhubhaṁga raṁga bahuraṁgada
bhaṁga tuṁga suguṇaiga taraṁga
susaṁga satya sāraṁga suśhrudivihaṁga pāba mṛdu saṁga vibhaṁga
bhūdala padaṁgā... madhu maṁgaḽa rūbame sūbavemirā
garuḍagamana rārā ... garuḍagamana rārā ...

Lyrics search