You are here

Gumdello emumdo kallallo telustu

Title (Indic)
గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తు
Work
Year
Language
Credits
Role Artist
Music Devi Sri Prasad
Performer Sumamgali
Venu
Writer Sirivennela Seetharama Sastry

Lyrics

Telugu

పల్లవి:

హఆఁఆఁ.. హఆఁఆఁ.. ఆ..ఆ..
హఆఁఆఁ.. ఆ..ఆ.. హఆఁఆఁ.. ఆ..ఆ..

గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలువదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!

గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా... ఓ మనసా...

చరణం 1:

పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ..
నువ్వు ఇపుడన్నదీ నేనెప్పుడూ విననిదీ..
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుందీ
కన్నులేదాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుందీ
ఏమో.. ఇదంతా.. నిజంగా కలలాగే ఉంది..

గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

చరణం 2:

ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నదీ..
ఎక్కడా జరగనీ వింతేమి కాదే ఇదీ..
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోందీ
పరిణయం దాక నడిపించే పరిచయం తోడు కోరిందీ
దూరం తలొంచి ముహూర్తం ఇంకెపుడొస్తుంది..

గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలువదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది..

మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా... ఓ మనసా...

English

pallavi:

haām̐ām̐.. haām̐ām̐.. ā..ā..
haām̐ām̐.. ā..ā.. haām̐ām̐.. ā..ā..

guṁḍĕllo emuṁdo kaḽḽaḽḽo tĕlustuṁdi
pĕdavullo ī maunaṁ nī pere pilustoṁdi
niluvadu kada hṛdayaṁ nuvu ĕduruga nilabaḍide
kadaladu kada samayaṁ.. nī aligiḍi vinaguṁṭe
kalavaramo tŏlivaramo tĕliyani taruṇamidi!

guṁḍĕllo emuṁdo kaḽḽaḽḽo tĕlustuṁdi
pĕdavullo ī maunaṁ nī pere pilustoṁdi

manasā manasā manasā manasā
manasā manasā manasā manasā
manasā manasā manasā o manasā... o manasā...

saraṇaṁ 1:

puvvulo lenidī nī navvulo unnadī..
nuvvu ibuḍannadī nenĕppuḍū vinanidī..
ninnilā sūsi payaniṁchi vĕnnĕle sinnaboduṁdī
kannuledāḍi kalalannī ĕdurugā vachchinaṭṭuṁdī
emo.. idaṁtā.. nijaṁgā kalalāge uṁdi..

guṁḍĕllo emuṁdo kaḽḽaḽḽo tĕlustuṁdi
pĕdavullo ī maunaṁ nī pere pilustoṁdi

saraṇaṁ 2:

ĕṁdugo tĕliyanī kaṁgāru puḍudunnadī..
ĕkkaḍā jaraganī viṁtemi kāde idī..
parimaḽaṁ vĕṁṭa payaniṁche parugu taḍabāḍu paḍudoṁdī
pariṇayaṁ dāga naḍibiṁche parisayaṁ toḍu koriṁdī
dūraṁ talŏṁchi muhūrdaṁ iṁkĕbuḍŏstuṁdi..

guṁḍĕllo emuṁdo kaḽḽaḽḽo tĕlustuṁdi
pĕdavullo ī maunaṁ nī pere pilustoṁdi
niluvadu kada hṛdayaṁ nuvu ĕduruga nilabaḍide
kadaladu kada samayaṁ.. nī aligiḍi vinaguṁṭe
kalavaramo tŏlivaramo tĕliyani taruṇamidi..

manasā manasā manasā manasā
manasā manasā manasā manasā
manasā manasā manasā o manasā... o manasā...

Lyrics search