Title (Indic)ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్ WorkGamyam Year2008 LanguageTelugu Credits Role Artist Music Sirivennela Seetharama Sastry Performer Ramjit LyricsTeluguపల్లవి: ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా చరణం 1: కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు .. అడగరే ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు ..పలకరే మనిషి అంటే ఎవరూ సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా చరణం 2: మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై ..నీడలు నిజాల సాక్ష్యాలే శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ..ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం పుట్టక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ తారరరరే తారరరరే తారరరరే తారారరే తారరరరే తారరరరే తారరేరా రారరరరే తారరరరే తారరరరే తారరేరా రారరరరే Englishpallavi: ĕṁtavaragu ĕṁdugŏragu iṁta parugu ani aḍakku gamaname nī gamyamaide bāḍalone bradugu dŏrugu praśhnalone badulu uṁdi gurdubaṭṭe guṁḍĕnaḍugu prabaṁchaṁ nīlo unnadani sĕppedāga ā nijaṁ tĕlusugovā tĕliste pradī soḍa ninnu nuvve kalusuguni palagariṁchugovā saraṇaṁ 1: kanabaḍevĕnnĕnni kĕraḍālu kalagalibi samudramaṁṭāru .. aḍagare ŏkkŏkka ala peru managilā ĕduraina pradivāru maniṣhane saṁdrāna kĕraḍālu ..palagare maniṣhi aṁṭe ĕvarū sarigā sūstunnadā nī madi madilo nuvve kadā unnadi suṭṭū addālalo viḍi viḍi rūbālu nuvvu kādaṁṭunnadi nī ūbirilo ledā gāli vĕluduru nī sūbullo ledā mannu minnu nīru annī kalibide nuvve kādā kādā prabaṁchaṁ nīlo unnadani sĕppedāga ā nijaṁ tĕlusugovā tĕliste pradī soḍa ninnu nuvve kalusuguni palagariṁchugovā saraṇaṁ 2: manasulo nīvaina bhāvāle bayaḍa kanibistāyi dṛśhyālai ..nīḍalu nijāla sākṣhyāle śhatṛvulu nīloni lobāle snehidulu nīgunna iṣhṭāle ..ṛtuvulu nī bhāva sitrāle ĕduraina maṁdahāsaṁ nīloni sĕlimi kosaṁ mosaṁ roṣhaṁ dveṣhaṁ nī magili madigi bhāṣhyaṁ puṭṭaga sāvu rĕṁḍe rĕṁḍu nīgavi sŏṁtaṁ kāvu ponī jīvidagālaṁ nīde nestaṁ raṁgulu eṁ vestāvo kānī tārararare tārararare tārararare tārārare tārararare tārararare tārarerā rārararare tārararare tārararare tārarerā rārararare