Niramtaramoo vasamtamule

నిరంతరమూ వసంతములే
Year
Language

పల్లవి:

నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే

నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే

చరణం 1:

హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం...
తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం...

నదులలో వీణమీటే తెమ్మెరే... మాకు ప్రాణం
అలలపై నాట్యమాడె వెన్నెలే... వేణుగానం
ఆకశానికవి తారలా ఆశతీర విరి రాజులా ??
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె

నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే

చరణం 2:

అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే...
మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే...
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
నిరంతరము వసంతములే ...మందారములా మరందములే

pallavi:

niraṁtaramū vasaṁtamule ..maṁdāramulā maraṁdamule
svarālu sumāluga pūse ...padālu phalāluga paṁḍĕ ..
niraṁtaramu vasaṁtamule ...maṁdāramulā maraṁdamule

niraṁtaramū vasaṁtamule ..maṁdāramulā maraṁdamule
svarālu sumāluga pūse ...padālu phalāluga paṁḍĕ ..
niraṁtaramu vasaṁtamule ...maṁdāramulā maraṁdamule

saraṇaṁ 1:

hāyigā pāḍabāḍe koyilĕ māgu nestaṁ...
tenĕlo tānamāḍĕ tummĕde māgu suṭṭaṁ...

nadulalo vīṇamīḍe tĕmmĕre... māgu prāṇaṁ
alalabai nāṭyamāḍĕ vĕnnĕle... veṇugānaṁ
āgaśhānigavi tāralā āśhadīra viri rājulā ??
ī samayaṁ uṣhodayamai mā hṛdayaṁ jvalistuṁṭĕ

niraṁtaramū vasaṁtamule ..maṁdāramulā maraṁdamule
svarālu sumāluga pūse ...padālu phalāluga paṁḍĕ ..
niraṁtaramu vasaṁtamule ...maṁdāramulā maraṁdamule

saraṇaṁ 2:

agnibatrālu rāsi grīṣhmame sāgiboye...
mĕrubulekhallu rāsi meghamai mūgavoye...
maṁchu dhānyālu kŏlisī pauṣhyame vĕḽḽiboye
māgha dāhālalonā aṁdame apsarāye
mallĕ kŏmma sirunavvulā manasuloni maru divvĕlā
ī samayaṁ rasodayamai mā praṇayaṁ phalistuṁṭe

niraṁtaramū vasaṁtamule ..maṁdāramulā maraṁdamule
svarālu sumāluga pūse ...padālu phalāluga paṁḍĕ ..
niraṁtaramu vasaṁtamule ...maṁdāramulā maraṁdamule