Ninnadidaaga shilanainaa

నిన్నటిదాక శిలనైనా
Year
Language

పల్లవి:

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా..
ఆ ఆ ఆ...

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

చరణం 1:

సరసా సరాగాల సుమరాణినీ
స్వరసా సంగీతాల సారంగినీ||2||

మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా||2||

మవ్వంపు నటనాల మాతంగిణి
కైలాశ శిఖారాగ్ర శైలూషికా నాట్య
డోలలూగే వేళా రావేల నన్నేలా

చరణం 2:

నిన్నే ఆరాధించు నీ దాసినీ
ప్రేమా ప్రాణాలైనా ప్రియురాలినీ ||2||

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
చెంత వెలిగే వేళా ఈ చింత నీకేలా

pallavi:

ninnaḍidāgā śhilanainā
nī padamu sogi ne gaudaminainā
ninnaḍidāgā śhilanainā

nī mamadāveśhabu vĕlluvalo
godāri gaṁganai pŏṁgudu unnā..
ā ā ā...

ninnaḍidāgā śhilanainā
nī padamu sogine gaudaminainā
ninnaḍidāgā śhilanainā

saraṇaṁ 1:

sarasā sarāgāla sumarāṇinī
svarasā saṁgīdāla sāraṁginī||2||

muvvā muvvagu muddu muribālu palugā||2||

mavvaṁpu naḍanāla mādaṁgiṇi
kailāśha śhikhārāgra śhailūṣhigā nāṭya
ḍolalūge veḽā rāvela nannelā

saraṇaṁ 2:

ninne ārādhiṁchu nī dāsinī
premā prāṇālainā priyurālinī ||2||

puvvu puvvugu navvu navagālu tĕlibe
sirunavvulo nenu sirimallini
svapna prabaṁchāla sauṁdarya dībālu
sĕṁta vĕlige veḽā ī siṁta nīgelā