Ninna monna regu vibina

నిన్న మొన్న రేకు విపిన
Year
Language

పల్లవి:

నిన్న మొన్న రేకు విపిన లేత మొగ్గా
నీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత తొందరా
//నిన్న మొన్న//

చరణం 1:

పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైట కొంగు చాటున దోబూచులాడెను ||2||

పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు
నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు ||2||
//నిన్న మొన్న//

చరణం 2:

పాల బుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందుతోటె వయసు జోరులు ||2||

చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు ||2||
//నిన్న మొన్న//

చరణం 3:

ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ||2||

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి ||2||

//నిన్న మొన్న//

pallavi:

ninna mŏnna regu vibina leda mŏggā
nīgu aṁtalonĕ nannu sūstĕ iṁta siggā

ninna mŏnna rĕkkalŏsina gaṁḍu tummĕda
nīgu aṁtalonĕ nannu sūstĕ iṁta tŏṁdarā
//ninna mŏnna//

saraṇaṁ 1:

parigiṇīlu kaṭṭinabuḍu leni sŏgasulu
nī paiḍa kŏṁgu sāḍuna dobūsulāḍĕnu ||2||

pasidanāna āḍugŏnna tŏkkuḍu biḽḽalu
nī paruvānigi nerbinavi duḍugu korgĕlu ||2||
//ninna mŏnna//

saraṇaṁ 2:

pāla buggalu pūsĕ leda kĕṁpulu
vālu sūbulaṁdudoḍĕ vayasu jorulu ||2||

siruda navvulu ŏligĕ silibidanālu
sinnanāḍi sĕlimi tīsĕ valabu dārulu ||2||
//ninna mŏnna//

saraṇaṁ 3:

innāḽḽu kaḽḽu kaḽḽu kalibi sūstivi
ibuḍela rĕppalalā rĕbarĕbannavi ||2||

innāḽḽu nī kaḽḽu ūrugunnavi
ibuḍevevo...
ibuḍevevo mūgabāsa lāḍudunnavi ||2||

//ninna mŏnna//