Ninna ee kalavarimta

నిన్న ఈ కలవరింత
Year
Language

పల్లవి:

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా (2)

చరణం 1:

దైవం ఉందంటిని అమ్మనెరిగాకనే కలలు నిజమంటిని ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

చరణం 2:

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా (2)

pallavi:

ninna ī kalavariṁta ledu le neḍu sirugāli edo aṁdi le
idiye prema aṁdurā vayase pulagariṁchĕnā
hṛdayaṁ karigiboyĕnā o manasā (2)

saraṇaṁ 1:

daivaṁ uṁdaṁṭini ammanĕrigāgane kalalu nijamaṁṭini āśha kaligāgane
premane ŏppugunnā ninnu sūśhāgane
pūsinā puvvulā navvule o dinaṁ vannĕlā mĕrubulā āyuve o kṣhaṇaṁ
sṛṣhṭi unnaṁta dāgā premale śhāśhvadaṁ
ninna ī kalavariṁta ledu le neḍu sirugāli edo aṁdi le
idiye prema aṁdurā vayase pulagariṁchĕnā
hṛdayaṁ karigiboyĕnā o manasā
ninna ī kalavariṁta ledu le neḍu sirugāli edo aṁdi le

saraṇaṁ 2:

niṁgi legunnanū bhūmi uṁṭuṁdile māḍa legunnanu bhāṣha uṁṭuṁdile
premaye legabode jīvidaṁ ledule
vāsane legane pūlu pūyŏchchule āgule āḍagā gāli kadalŏchchule
baṁdhame legabode prema janmiṁchune
ninna ī kalavariṁta ledu le neḍu sirugāli ĕdo aṁdi le
idiye prema aṁduna vayase pulagariṁchĕnā
hṛdayaṁ karigiboyĕnā o manasā (2)