Nijamgaa nenenaa

నిజంగా నేనేనా
Year
Language

పల్లవి:

నిజంగా నేనేనా ఇలా నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేలోలోనా ప్రేమా

చరణం 1:

మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం
వింతని నమ్మనుగా

చరణం 2:

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతాలనే కవ్వింతలే పిలుస్తు ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట
పరవశమేదో తోడవుతుంటే
పగలే రేయిలా గగనంలోనా తారలు చేరెనుగా

pallavi:

nijaṁgā nenenā ilā nījadalo unnā
idaṁtā premenā ĕnno viṁtalu sūstunnā
ĕdalo ĕvaro seri annī sestunnārā
vĕnage vĕnage uṁṭū nībai nanne tostunnārā
hare hare hare hare hare rāmā
marī ilā ĕlā vachchesiṁdi dhīmā
ĕṁto huṣhārugā unnādelolonā premā

saraṇaṁ 1:

manassugi pradikṣhaṇaṁ nuvve prabaṁchaṁ
o samudramai anukṣhaṇaṁ pŏṁge saṁtoṣhaṁ
aḍugulalonā aḍugulu vestū
naḍisina dūraṁ ĕṁto unnā
alasaḍa rādu gaḍisina kālaṁ
viṁtani nammanugā

saraṇaṁ 2:

nā kale ilā nijālugā nilustu uṁṭe
nā gadālane kavviṁtale pilustu uṁṭe
ī varālugā ullāsame kurustu uṁṭe
pĕdavigi sĕṁpa tagilina soḍa
paravaśhamedo toḍavuduṁṭe
pagale reyilā gaganaṁlonā tāralu serĕnugā