Title (Indic)చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానన WorkNenunnanu Year2004 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Suneeda Performer M.M. Keeravani Writer Samdrabos LyricsTeluguపల్లవి: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ.. నీకేం కాదని నిన్నటి రాతని.. మార్చేస్తానని చరణం 1: తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండేతో ధైర్యం చెప్పెను.. చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను.. నేనున్నానని నేనున్నాననీ.. నీకేం కాదని నిన్నటి రాతని.. మార్చేస్తానని.. చరణం 2: ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను.. మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను... నేనున్నానని నేనున్నాననీ... నీకేం కాదని నిన్నటి రాతని.. మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను.. నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను.. నేనున్నానని నేనున్నాననీ.. నీకేం కాదని నిన్నటి రాతని.. మార్చేస్తానని Englishpallavi: sīgaḍido vĕluge sĕppĕnu nenunnānani oḍamido gĕlube sĕppĕnu nenunnānani nenunnānanī.. nīgeṁ kādani ninnaḍi rādani.. mārsestānani saraṇaṁ 1: tagile rāḽḽani punādi sesi yadagālani tarime vāḽḽani hiduluga talasi muṁdugĕḽḽālani kannula nīḍini kalalu sāgugai vāḍugovālani kālse nippuni pramidaga malasi kāṁti paṁchālani guṁḍedo dhairyaṁ sĕppĕnu.. sūbudo mārgaṁ sĕppĕnu aḍugudo gamyaṁ sĕppĕnu.. nenunnānani nenunnānanī.. nīgeṁ kādani ninnaḍi rādani.. mārsestānani.. saraṇaṁ 2: ĕvvaru leni ŏṁṭari jīvigi toḍu dŏrigiṁdani aṁdaru unnā āptuḍu nuvvai seruvayyāvani janmagu yĕrugani anurāgānni paṁchudunnāvani janmalu sālani anubaṁdhānni pĕṁchudunnāvani śhvāsado śhvāse sĕppĕnu.. manasudo manase sĕppĕnu praśhnado badule sĕppĕnu... nenunnānani nenunnānanī... nīgeṁ kādani ninnaḍi rādani.. mārsestānani sīgaḍido vĕluge sĕppĕnu.. nenunnānani oḍamido gĕlube sĕppĕnu.. nenunnānani nenunnānanī.. nīgeṁ kādani ninnaḍi rādani.. mārsestānani