నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
పల్లవి:
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా..ఆ..
చరణం 1:
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు
తేనెపట్టు రేగినట్టు వీణమెట్టు ఉలికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ.. హో.. హో.. ఓ.. ఓ..
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా..ఆ..
చరణం 2:
చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనపడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవా కనురెప్పలకే మాటొస్తే ఓ.. హో.. హో.. ఓ.. ఓ..
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా..ఆ..
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా..ఆ..
pallavi:
nenu nenugā lene ninna mŏnnalā
leni poni ūhallo emiḍo ilā
unnabāḍugā edo kŏtta janmalā
ippuḍe ikkaḍe puṭṭinaṭṭugā
nenu nenugā lene ninna mŏnnalā
leni poni ūhallo emiḍo ilā
unnabāḍugā edo kŏtta janmalā
ippuḍe ikkaḍe puṭṭinaṭṭugā..ā..
saraṇaṁ 1:
pūla sĕṭṭu ūginaṭṭu pāla bŏṭṭu siṁdinaṭṭu
alluguṁdi nā suṭṭū o sirunavvu
tenĕbaṭṭu reginaṭṭu vīṇamĕṭṭu uliginaṭṭu
jhallumaṁdi guṁḍĕllo ĕvare nuvvu
nā manasuni maimarabuna muṁchina ā vāna
mīgĕvarigi kanibiṁchadu emainā o.. ho.. ho.. o.. o..
nenu nenugā lene ninna mŏnnalā
leni poni ūhallo emiḍo ilā
unnabāḍugā edo kŏtta janmalā
ippuḍe ikkaḍe puṭṭinaṭṭugā..ā..
saraṇaṁ 2:
suṭṭubakkalĕṁdarunnā gurdubaṭṭalega unnā
aṁtamaṁdi ŏkkalāge kanabaḍuduṁṭe
tappu nādi kādu annā ŏppugoru ŏkkarainā
sĕppalenu nijamedo nāgū viṁte
kaḽḽanu vadilĕḽḽanu ani kammina mĕrubedo
sĕppavā kanurĕppalage māḍŏste o.. ho.. ho.. o.. o..
nenu nenugā lene ninna mŏnnalā
leni poni ūhallo emiḍo ilā
unnabāḍugā edo kŏtta janmalā..ā..
ippuḍe ikkaḍe puṭṭinaṭṭugā..ā..