పల్లవి:
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది ||2||
నేనొక ప్రేమ పిపాసిని....
చరణం 1:
తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా ||2||
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...
చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...
చరణం 3:
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను
pallavi:
nenŏga prema pibāsini nīvŏga āśhrama vāsivi
nā dāhaṁ tīranidi nī hṛdayaṁ kadalanidi ||2||
nenŏga prema pibāsini....
saraṇaṁ 1:
talubu mūsina talavāgiḍilo pagalu reyi nilusunnā
pilisi pilisi badulerāga alasi tirigi vĕḽudunnā ||2||
nā dāhaṁ tīranidi nī hṛdayaṁ karaganidi
nenŏga prema pibāsini...
saraṇaṁ 2:
pūḍa pūḍa nī pūja kosamani puvvulu tĕchchānu
prema bhikṣhanū pĕṭṭagalavani dosili ŏggānu
nī aḍugulagu maḍugulottagā ĕḍadanu parisānu
nīvu rāgane aḍugu paḍagane naligiboyānu
nenŏga prema pibāsini...
saraṇaṁ 3:
pagaḍigi reyi .. reyigi pagalu.. palige vīḍkolu
sĕga regina guṁḍĕgu sĕbudunnā nī sĕvina paḍide sālunani
nī jñābagāla nīḍalalo nannebuḍo sūstāvu
nanu valasāvani tĕlibelogā nivuraibodānu