Nelloori nerajaana ne kumkumalle maariba

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిప
Work
Year
Language

పల్లవి:

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరొలకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలం మరిచి అడవి చెట్టు పూసెనులే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

చరణం 1:

జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని
వేళ్ళతొ వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు

అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట కైపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

చరణం 2:

ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా...
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడ
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడె పసుపు లాగ... నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం... మార్చుకుంటా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

pallavi:

nĕllūri nĕrajāṇa ne kuṁkumallĕ māribonā
nuvvu snānamāḍĕ pasubu lāga nannu kŏṁchĕṁ pūsugove
nī aṁdĕlagu muvvalāga nannu kŏṁchĕṁ mārsugove

nĕllūri nĕrajāṇa ne kuṁkumallĕ māribonā
nuvvu snānamāḍĕ pasubu lāga nannu kŏṁchĕṁ pūsugove
nī aṁdĕlagu muvvalāga nannu kŏṁchĕṁ mārsugove

ŏga kaṁṭa nīrŏlagā pĕdavĕṁṭa ūsŏrŏlagā
nī valla ŏga pari jananaṁ ŏga pari maraṇaṁ ayinadi
adi pāreḍi sĕlayeru ala saṁdrāna kalisinaṭṭu guṁḍĕ nī toḍugā vĕṁṭāḍĕne
arĕ kālaṁ marisi aḍavi sĕṭṭu pūsĕnule

nĕllūri nĕrajāṇa ne kuṁkumallĕ māribonā
nuvvu snānamāḍĕ pasubu lāga nannu kŏṁchĕṁ pūsugove
nī aṁdĕlagu muvvalāga nannu kŏṁchĕṁ mārsugove

saraṇaṁ 1:

jŏnna kaṁki dhūḽĕ paḍinaṭṭu kannulalo dūri tŏlasidive
tīga vadilŏchchina malligave ŏga māru navvudū badulīve
pĕdavibai pĕdavuṁchi māḍalanu jurrugŏni
veḽḽadŏ vattina mĕḍabai ragilina tābamiṁka poledu

arĕ mĕriseḍi raṁgu nīdi nī aṁdānigĕduredi
nuvvu tāge soḍa kaibĕkkule
iga ŏḽḽu mŏttaṁ sĕyyavalĕnu puṇyamule

nĕllūri nĕrajāṇa ne kuṁkumallĕ māribonā
nuvvu snānamāḍĕ pasubu lāga nannu kŏṁchĕṁ pūsugove
nī aṁdĕlagu muvvalāga nannu kŏṁchĕṁ mārsugove

saraṇaṁ 2:

ŏga ghaḍiya kaugili bigiyiṁchi nā ūbirābavĕ o sĕliyā...
nī guṁḍĕ logili ne serā nannu kŏṁchĕṁ hattugo sĕligāḍa
sinugaṁṭi sirumāḍa vĕlugaṁṭi ā sūbu
dehamiṁka maṭṭilo kalisiboyevaragu orsuno
prāṇaṁ nā seṁtanuṁḍaṁgā nuvu maraṇiṁchibovuḍĕlā
arĕ nī jīvame nenenayā saṁpadalasu maraṇamaina māyamayā

nĕllūri nĕrajāṇa ne kuṁkumallĕ māribonā
nuvvu snānamāḍĕ pasubu lāga... ninnu kŏṁchĕṁ pūsuguṁṭā
nī aṁdĕlagu muvvalāga nannu kŏṁchĕṁ... mārsuguṁṭā

o..o..o..o..o..