Neerugaari paaribogu neerasaana jaaribogu

నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు
Year
Language

పల్లవి:

నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే మేలుకో...
మారుమూల దాగిపోకు ...పిరికి మందు తాగబోకు .. లే మేలుకో...
ఎందుకీ భయం... అందుకో జయం...
నీడలాగ నీకు తోడు నేనే లేనా...

నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే

చరణం 1:

రూపురేఖలో చురుకైన చూపులో .. నీవే జాకీ చాన్...
కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే... సూపర్ మాన్

కీచులాటలు కుంఫుల ఫైటులు రావే ...ఏం చేస్తాం..
ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో... పడి చస్తాం...
అహ ఎంతవారలైన నీకు చీమ దోమ...
హయ్యో ! ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా...

హి మాన్ లా నువ్వు హుంకరించరా...
ఆ పైన నా ప్రాణం హరించరా...
వీరస్వర్గమే వరించరా...

మాయదారి మాటలేల మాయలేడి వేటలేల .... నే రాను పో..
చేతగాని శౌర్యమేల ..ఈదలేని లోతులేల హా...!

చరణం 2:

పాలపాలుడా పలనాటి బాలుడా .. ఏదీ నీ ధైర్యం...
కదనవీరుడా అసహాయ శూరుడా .. కానీ ఘనకార్యం...
నీకు మొక్కుతా ...ఒక మూల నక్కుతా .. పోరే వద్దంట..
బతుకు దక్కితే బలుసాకు మొక్కుతా .. పోనీ నన్నిట్టా...

అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా...
చేయలేదు ఇంతవరకు జీవిత భీమా...
ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో...
అమ్మనాయనో నన్నింక విడిచిపో...
జంకు బొంకు లేక నడిచిపో...

మాయదారి మాటలేల ...మాయలేడి వేటలేల .... నే రాను పో..
చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేల నే రాను పో...
పాడు రొంపిలో నన్ను దింపకే...
ముందు నుయ్యి వెనుక గొయ్యి...చావే ఖాయం...

నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే మేలుకో...
మారుమూల దాగిపోకు ...పిరికి మందు తాగబోకు .. లే .......

pallavi:

nīrugāri pāribogu... nīrasāna jāribogu ..le melugo...
mārumūla dāgibogu ...pirigi maṁdu tāgabogu .. le melugo...
ĕṁdugī bhayaṁ... aṁdugo jayaṁ...
nīḍalāga nīgu toḍu nene lenā...

nīrugāri pāribogu... nīrasāna jāribogu ..le

saraṇaṁ 1:

rūburekhalo surugaina sūbulo .. nīve jāgī sān...
kŏṁḍarāḽḽane nī kaṁḍarālado lebe... sūbar mān

kīsulāḍalu kuṁphula phaiḍulu rāve ...eṁ sestāṁ..
ĕgiri dūgaḍaṁ alavāḍu ledĕlā ammo... paḍi sastāṁ...
aha ĕṁtavāralaina nīgu sīma doma...
hayyo ! ĕṁdugamma aṁta seḍu dhīmā bhāmā...

hi mān lā nuvvu huṁkariṁcharā...
ā paina nā prāṇaṁ hariṁcharā...
vīrasvargame variṁcharā...

māyadāri māḍalela māyaleḍi veḍalela .... ne rānu po..
sedagāni śhauryamela ..īdaleni lodulela hā...!

saraṇaṁ 2:

pālabāluḍā palanāḍi bāluḍā .. edī nī dhairyaṁ...
kadanavīruḍā asahāya śhūruḍā .. kānī ghanagāryaṁ...
nīgu mŏkkudā ...ŏga mūla nakkudā .. pore vaddaṁṭa..
badugu dakkide balusāgu mŏkkudā .. ponī nanniṭṭā...

aha kīḍu nīḍa sūsi nīgu bhayamā bhīmā...
seyaledu iṁtavaragu jīvida bhīmā...
āṁjaneyuḍā nī śhakti tĕlusugo...
ammanāyano nanniṁka viḍisibo...
jaṁku bŏṁku lega naḍisibo...

māyadāri māḍalela ...māyaleḍi veḍalela .... ne rānu po..
sedagāni śhauryamela īdaleni lodulela ne rānu po...
pāḍu rŏṁpilo nannu diṁpage...
muṁdu nuyyi vĕnuga gŏyyi...sāve khāyaṁ...

nīrugāri pāribogu... nīrasāna jāribogu ..le melugo...
mārumūla dāgibogu ...pirigi maṁdu tāgabogu .. le .......