Neelo virisina amdaalannee

నీలో విరిసిన అందాలన్నీ
Year
Language

పల్లవి:

నీ..లో విరిసిన అందాలన్నీ నా..లో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ.. నీ..లో పలికిన రాగాలన్నీ నా..లో శ్రావణ మేఘాలాయె
ఊఁ ఊఁ.. నీ..లో విరిసిన అందాలన్నీ నా..లో వీడని బంధాలాయె

చరణం 1:

అల్లరి గాలి నిమిరే దాకా మల్లె మొగ్గకు తెలియదు...ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ.. తానొక తుమ్మెదకై తపియించేననీ

మూగ కోరికా ముసిరే దాకా.. మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు .. ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని.. తానొక ముద్దుకై తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా.. ఆ కోరికలే ఇద్దరిలోనా.. కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీ..లో విరిసిన అందాలన్నీ నా..లో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ..

చరణం 2:

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు...ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ.. తానొక వధువుగా ముస్తాబైనాననీ

ఏడడుగులు నడిచేదాకా.. ఏడడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు..ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ..ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ
ఆ బంధాలే ఇద్దరిలోనా.. ఆ బంధాలే ఇద్దరిలోనా.. కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీ..లో విరిసిన అందాలన్నీ నా..లో వీడని బంధాలాయె
ఓ .. ఓ .. ఓ ... నీ..లో పలికిన రాగాలన్నీ నా..లో శ్రావణ మేఘాలాయె

pallavi:

nī..lo virisina aṁdālannī nā..lo vīḍani baṁdhālāyĕ
o o o.. nī..lo paligina rāgālannī nā..lo śhrāvaṇa meghālāyĕ
ūm̐ ūm̐.. nī..lo virisina aṁdālannī nā..lo vīḍani baṁdhālāyĕ

saraṇaṁ 1:

allari gāli nimire dāgā mallĕ mŏggagu tĕliyadu...emanī
tānŏga tummĕdagai tabiyiṁchenanī.. tānŏga tummĕdagai tabiyiṁchenanī

mūga korigā musire dāgā.. mūga korigā musire dāgā
mūsina pĕdavigi tĕliyadu .. emanī
tānŏga muddugai tahadahalāḍenani.. tānŏga muddugai tahadahalāḍenani
ā korigale iddarilonā.. ā korigale iddarilonā.. kārdīga pūrṇimalai vĕlagāli

nī..lo virisina aṁdālannī nā..lo vīḍani baṁdhālāyĕ
o o o..

saraṇaṁ 2:

madhumāsaṁ vachche dāgā māmiḍigunnagu tĕliyadu...emanī
tānŏga vadhuvugā mustābainānanī.. tānŏga vadhuvugā mustābainānanī

eḍaḍugulu naḍisedāgā.. eḍaḍugulu naḍisedāgā
vadhūvarulage tĕliyadu..emanī
ā eḍaḍugulu eḍeḍu janmala baṁdhālanī..ā eḍaḍugulu eḍeḍu janmala baṁdhālanī
ā baṁdhāle iddarilonā.. ā baṁdhāle iddarilonā.. kārdīga pūrṇimalai vĕlagāli

nī..lo virisina aṁdālannī nā..lo vīḍani baṁdhālāyĕ
o .. o .. o ... nī..lo paligina rāgālannī nā..lo śhrāvaṇa meghālāyĕ