Needo seppanaa

నీతో చెప్పనా
Work
Year
Language

పల్లవి:

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ అ
నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ

చరణం 1:

ఇంకొంచెం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా?

పనిమాలా పైపైనా పడతావేం పసికూనా
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా?

మగువ మనసు తెలిసేనా మగజాతికి?

మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి?

గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

చరణం 2:

ఒదిగున్నా ఒరలోన కదిలించకే కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారేనా

పెదవోపని పదునైన పరవలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా?

సొంత సొగసు బరువేనా సుకుమారికి?

అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి?

గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా అ అ అ
ఓ... నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ

pallavi:

nīdo sĕppanā nīkkūḍā tĕlisinā
nuvvĕṁtagā rĕchchibode aṁta saradā tĕlusunā

gāraṁ sesinā nayagāraṁ sūbinā
kanigārame kalugudoṁde kaṣhṭabaḍage kāṁchanā

nene nenugā lene lenugā a a a a
nā kannulā nīde vĕnnĕlā o o o

saraṇaṁ 1:

iṁkŏṁchĕṁ anugunnā igasālle annānā
vadalamaṁṭe emiḍardhaṁ vadili pŏmmanā?

panimālā paibainā paḍadāveṁ pasigūnā
muddu mīrudunna paṁtaṁ haddulone ābanā?

maguva manasu tĕlisenā magajādigi?

mŏgali mŏnalu tagilenā leda soyagānigi kūda denigi?

gāraṁ sesinā nayagāraṁ sūbinā
kanigārame kalugudoṁde kaṣhṭabaḍage kāṁchanā

saraṇaṁ 2:

ŏdigunnā ŏralona kadiliṁchage kurradānā
kattisāmudo pramādaṁ paṭṭu jārenā

pĕdavobani padunaina paravaledanugonā
kŏtta premalo vinodaṁ nīgu nenu nerbanā?

sŏṁta sŏgasu baruvenā sugumārigi?

aṁta birusu paruvenā rāgumaruḍaṁṭi nī rājasānigi?

gāraṁ sesinā nayagāraṁ sūbinā
kanigārame kalugudoṁde kaṣhṭabaḍage kāṁchanā
nene nenugā lene lenugā a a a
o... nā kannulā nīde vĕnnĕlā o o o